- రూ. 9.99 లక్షలతో ఎక్స్-షోరూమ్ ధరలు ప్రారంభం
- 3 వేరియంట్స్ మరియు 4 కలర్స్ లో లభ్యం
జెఎస్ డబ్లూ ఎంజి మోటార్ ఇండియా ఇటీవలే కొత్త విండ్‍సర్ ఈవీ ఎంట్రీ-లెవల్ ఎక్సైట్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ను రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇప్పుడు, పూర్తిగా ధర వెల్లడి కాకముందే, ఈ మోడల్ ఇండియా అంతటా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
వేరియంట్స్ మరియు కలర్స్ విషయానికొస్తే, ఎంజి విండ్‍సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే 3 వేరియంట్‌లలో, క్లే బీజ్,పెరల్ వైట్, స్టార్‌బర్స్ట్ బ్లాక్ మరియు టర్కోయిస్ గ్రీన్ అనే 4 కలర్ ఆప్షన్స్ తో అందించబడుతోంది.
ఇక బ్యాటరీ వివరాలు చూస్తే, విండ్‍సర్ ఈవీ 38kWh బ్యాటరీ ప్యాక్ ని పొందింది. ఇది 134bhp మరియు 200Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌లతో జత చేయబడింది. అలాగే, విండ్‍సర్ ఈవీ లో ఉన్న అన్ని ఒకే విధమైన బ్యాటరీ ప్యాక్‌ను పొందుతాయి. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ తో 331కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, టాప్-స్పెక్ ఎసెన్స్ వేరియంట్ పెద్ద 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, మరియు 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది.
అనువాదించిన వారు: రాజపుష్ప