- ఒక గంటలోనే బుకింగ్ మైలురాయిని సాధించిన XUV 3XO
- మే 26నుండి ప్రారంభం కానున్న డెలివరీ
మహీంద్రా ఈ వారం ప్రారంభంలో XUV 3XO బుకింగ్‌లను రూ. 11,000 ధరతో ప్రారంభించగా, ఇప్పుడు, ఈ మోడల్ కేవలం మొదటి 10 నిమిషాల్లో 27,000 బుకింగ్‌లను నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. అదనంగా,దీని బుకింగ్‌లు ప్రారంభమైన గంటలోపే 50,000 బుకింగ్‌ల మైలురాయిని సాధించింది.
అదే విధంగా, మహీంద్రా నెలకు 9,000 యూనిట్లను () ఉత్పత్తి చేసే ప్రొడక్షన్ కెపాసిటీని కలిగి ఉందని మరియు 15 మే, 2024 నాటికే (ఇప్పటికే) 10,000 యూనిట్లను ఉత్పత్తి చేసిందని మహీంద్రా పేర్కొంది. ఈ సబ్-4- మీటర్ ఎస్‌యువి డెలివరీ మే 26న ప్రారంభంకానుండగా, దీనిని రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు.
న్యూ మహీంద్రా XUV 3XOని కస్టమర్లు తొమ్మిది వేరియంట్స్, ఎనిమిది కలర్స్ మరియు మూడు ఇంజిన్ ఆప్షన్స్ నుండి ఎంచుకోవచ్చు. అలాగే, ఈ కారును మేము డ్రైవ్ చేసిన రివ్యూ మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. XUV 3XOలోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లలో న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్)సూట్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప