- టాప్-స్పెక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం
- తాజాగా మూడు కొత్త వేరియంట్లతో వచ్చిన నెక్సాన్
కొన్ని ఆసక్తికరమైన ఈవెంట్ల తర్వాత, టాటా నెక్సాన్ పనోరమిక్ సన్ రూఫ్ తో కనిపిస్తున్న వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. బెస్ట్-సెల్లింగ్ కాంపాక్ట్ డ్యూయల్-పేన్ సన్ రూఫ్ ని పొందుతుందని ఇది వరకే అందరూ ఊహించారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం, నెక్సాన్ యొక్క స్మార్ట్+ S వేరియంట్ సింగిల్-పేన్ ఎలక్ట్రికల్లీ సన్ రూఫ్ తో అందించబడుతుంది.
టాటా నెక్సాన్ ఇప్పుడు స్మార్ట్, స్మార్ట్+, ప్యూర్, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్ లెస్, మరియు ఫియర్ లెస్+ అనే ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ అన్నీ వేరియంట్లను S వెర్షన్ తో కూడా ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఇందులోని ఫీచర్ లిస్టుకి సన్ రూఫ్ జతచేయబడింది. ఇప్పుడు, టాప్-స్పెక్ ఫియర్ లెస్+ వేరియంట్ కూడా పనోరమిక్ సన్ రూఫ్ తో అందించబడుతుందని మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో కేవలం మహీంద్రా XUV 3XO మాత్రమే పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్ ని పొందింది.
ఇంకా చెప్పాలంటే, దీని ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కార్ మేకర్ ఎడాస్ సూట్ (ఏడీఏఎస్) వంటి కొన్ని అందనపు ఫీచర్లను ఇందులో తీసుకువచ్చింది. నెక్సాన్ కి ప్రధానంగా పోటీగా ఉన్న కంపెనీలు ఆయా కార్లలోని టాప్-స్పెక్ వేరియంట్లలో లెవెల్-1 మరియు లెవెల్-2 సూట్స్ ని తీసుకువచ్చాయి.
ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ రేసర్ ని లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. మేము అందించిన ఇదే సమాచారం టాటా మోటార్స్ నుంచి అధికారిక ప్రకటన ద్వారా త్వరలో వస్తుందని మేము భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్