- ఇండియాలో జూన్ 2024లో వెల్లడి కానున్న ఆల్ట్రోజ్ రేసర్ ధరలు
- మరింత పవర్‍ఫుల్ ఇంజిన్ మరియు కొత్త ఫీచర్లతో లభించనున్న మోడల్
వచ్చే నెలలో జరగబోయే దాని లాంచ్ కి ముందే, లాంచ్ కానున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇటీవల పబ్లిక్ రోడ్ పై టెస్ట్ చేస్తూ అనేక సందర్భాలలో కనిపించింది. అలాగే, వెబ్‌లో షేర్ చేసిన న్యూ స్పై షాట్‌లలో ఆల్ట్రోజ్ రేంజ్ లో న్యూ టాప్-స్పెక్ గాఅందించబడే ఈ వెర్షన్ సింగిల్, ఏ మాత్రం కామోఫ్లేజ్ తోకప్పబడకుండా టెస్ట్ మ్యూల్ కనిపించింది.
స్పై షాట్‌లలో చూసినట్లుగా, న్యూ ఆల్ట్రోజ్ రేసర్ ఆరెంజ్ మరియు బ్లాక్ కలర్ డ్యూయల్-టోన్ షేడ్‌తో పూర్తి చేయబడింది. అలాగే, భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో ప్రదర్శించబడిన స్పెక్ ఇదే. ఈ కారులో కొన్ని ఇతర ముఖ్యమైన డిజైన్ అంశాలను చూస్తే, రూఫ్ మరియు బానెట్‌పై రెండు తెల్లని చారలు, ట్వీక్ చేసిన ఫ్రంట్ గ్రిల్ మరియు 'రేసర్' బ్యాడ్జింగ్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే,ఒకే రకమైన యూనిట్ తో ప్రస్తుతం విక్రయించబడుతున్న కారు మాదిరిగానే ఇది డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌పై రైడ్ చేస్తుంది. ఇంతకు ముందు ప్రదర్శించబడిన న్యూ సెట్ వీల్స్ కాదు.
లోపల భాగంలో, 2024 టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, న్యూ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, న్యూ అప్‌హోల్స్టరీ, రెడ్ ఇన్‌సర్ట్‌స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి వివిధ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నాం.
హుడ్ కింద, న్యూ టాటా ఆల్ట్రోజ్ రేసర్ అదే 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండనుంది. ఈ యూనిట్ అధికంగా 118bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడే అవకాశం ఉంది. లాంచ్ తర్వాత, ఆల్ట్రోజ్ రేసర్ హ్యుందాయ్ i20 N లైన్ వంటి వాటితో పోటీ పడనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప