- రూ. 45.95 లక్షల ధరతో లభ్యం
- అందుబాటులో ఉన్న ఒకేఒక్క టాప్-స్పెక్ వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా అయోనిక్ 5ని దేశంలో ప్రారంభ ధర రూ. 44.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో లాంచ్ చేసింది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ ధర పెరిగిన తర్వాత ప్రస్తుతం ధర రూ. 45.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే, ఈకొరియన్ ఆటోమేకర్ జూలై 2023లో 500 యూనిట్ సేల్స్ లక్ష్యాన్ని సాధించింది . ప్రస్తుతం, భారతదేశంలో ఇప్పటివరకు 1000 యూనిట్లకు పైగా అయోనిక్ 5 విక్రయించినట్లు ఈ బ్రాండ్ ప్రకటించింది.
అయోనిక్ 5 ఒకే ఒక్క టాప్-స్పెక్ ఆర్‌డబ్ల్యూడి వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ఎలక్ట్రిక్ మోటార్‌తో 72.6kWh బ్యాటరీ ప్యాక్ తో జతచేయబడి పవర్‌ని అందిస్తుంది. ఈ స్థితిలో, ఆల్-ఎలక్ట్రిక్ అయోనిక్ 5 216bhp మరియు 350Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
అంతేకాకుండా, దీనిని ఒక్కసారిగా ఫుల్ ఛార్జ్ చేస్తే ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ చేసిన 631కిమీల డ్రైవింగ్ రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఛార్జింగ్ గురించి చెప్పాలంటే, ఈ మోడల్ లో బ్యాటరీ ప్యాక్ ని 350kW డిసి ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప