- 2024లో లాంచ్ అయ్యే అవకాశం
- సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‍రూఫ్‍తో వస్తున్న థార్
దేశవ్యాప్తంగా కస్టమర్లు మహీంద్రా కంపెనీ నుండి లాంచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వాటిలో 5-డోర్ మహీంద్రా థార్ ఒకటిగా నిలుస్తుంది. ఈ మోడల్ దేశం అంతటా అక్కడక్కడా టెస్టింగ్ చేస్తూ ఎన్నోసార్లు కనిపించింది. తాజాగా ఈ 5-డోర్ థార్ యొక్క ప్రొడక్షన్-రెడీ వెర్షన్ టెస్టింగ్ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది, దీని ద్వారా ఈ మోడల్ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఇంతకు ముందున్న స్పై షాట్స్ చూస్తే, ఈ మోడల్ యొక్క ఎక్స్‌టీరియర్ లో కొత్త మరియు రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్ సెట్ తో రీడిజైన్డ్ రియర్ ప్రొఫైల్, కొత్త అల్లాయ్ వీల్స్, మరియు పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యండిల్స్ ఉండనున్నాయి.
మొత్తానికి, 5-డోర్ థార్ క్యాబిన్‌లో మాత్రం భారీ మార్పులు చోటుచేసుకోవచ్చని భావిస్తున్నాం. ఈ ఫోటోలో చూసినట్లుగా, రాబోయే ఆఫ్-రోడర్ లో అడ్జస్టబుల్ సింగిల్-పేన్ సన్‌రూఫ్, రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ మరియు క్యాబిన్ కోసం చిన్నపాటి థీమ్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ తాజా సమాచారంతో 5-డోర్స్ తో వస్తున్న లైఫ్ స్టైల్ ఎస్‍యూవీలో ఇంటీరియర్స్ మరింత ప్రీమియంగా మరియు మరిన్ని ఫీచర్స్ ఉండనున్నట్లు మేము భావిస్తున్నాము.
ఇందులోని మెకానికల్స్ గురించి చెప్పాలంటే, రాబోయే 5-డోర్ మహీంద్రా థార్ కూడా ఇంతకు ముందున్న 3-డోర్ వెర్షన్ వలే ఒకే రకమైన పవర్ ట్రెయిన్ తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది 2.2-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బో పెట్రోల్ మోటారుతో రానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్