- బిఎండబ్ల్యూ i7, ఎంజి కామెట్, వోల్వో C40 రీచార్జ్ మరియు ఇతర కార్లతో గట్టి పోటీ
- ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్
మొత్తానికి ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 రిజల్ట్స్ వచ్చేశాయి. ఈ మధ్యే లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ మోడల్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 టైటిల్ ని గెలుచుకుంది. మరొక హ్యుందాయ్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ హ్యుందాయ్ అయోనిక్ 5 గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.
గ్రీన్ కార్ టైటిల్ కోసం హ్యుందాయ్ అయోనిక్ 5బిఎండబ్ల్యూ i7, మెర్సిడెజ్-బెంజ్ఈక్యూఈ, వోల్వో C40రీచార్జ్, బివైడిఅట్టో3, మహీంద్రా ఎక్స్‌యూవీ400, సిట్రోన్ eC3 మరియు ఎంజికామెట్ వంటి వివిధ కంపెనీలకు చెందిన మోడల్స్ తో పోటీ పడింది. ఇక ఇందులో 2వ మరియు 3వ స్థానాలను వరుసగా బిఎండబ్ల్యూ i7 మరియు ఎంజికామెట్ దక్కించుకున్నాయి.
హ్యుందాయ్ అయోనిక్ 5 ఇండియాలో ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో-2023లో మొదటిసారిగా పరిచయం చేయబడింది. ప్రస్తుతం, ఈ మోడల్ రూ. 45.95 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది 72.6kWh బ్యాటరీ ప్యాక్ యూనిట్‌తో పాటుగా క్రాస్‌ఓవర్ రియర్ వీల్ పై ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంటుంది. ఇక దీని అవుట్ పుట్ విషయానికి వస్తే, అయోనిక్-5 216bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేయడమే కాకుండా 631కి.మీ. క్లెయిమ్డ్మైలేజీని ఇస్తుంది. అయితే, మేము చేసిన రియల్-వరల్డ్ టెస్టులో అయోనిక్-5ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 442.86 కి.మీ.ల డ్రైవింగ్ రేంజ్ ని మాత్రమే ఇవ్వగలిగింది. ఇక చార్జింగ్ స్పీడ్స్ విషయానికి వస్తే, 350kW ఫాస్ట్ చార్జర్ ద్వారా చార్జ్ చేస్తే కేవలం 18 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయగలదు.
తాజాగా, ఈ కొరియన్ బ్రాండ్ ఆటోమేకర్ తమ మోడల్ అయిన అయోనిక్ 5 యొక్క 1100వ యూనిట్ డెలివరీని ఇండియాలో పూర్తి చేసుకుంది. అయోనిక్-5 డెలివరీని కూడా ఇండియాలో ఉన్న పాపులర్ సెలెబ్రిటీ, బాలివుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కి డెలివరీ చేయడం జరిగింది.
ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024(ఐసిఓటివై-2024) జ్యూరీ సభ్యులుగా కార్‌వాలే.కాం నుండి విక్రాంత్ సింగ్, ఆటోఎక్స్ నుండి ధృవ్ బెహ్ల్ మరియు ఇషాన్ రాఘవ, ఆటో టుడే నుండి యోగేంద్ర ప్రతాప్ మరియు రాహుల్ ఘోష్, కార్ ఇండియా నుండి అస్పి భతేనా మరియు జాషువా వర్గీస్, ఈవో ఇండియా నుండి శిరీష్ చంద్రన్ మరియు ఆతీష్ మిశ్రా, మోటరింగ్ వరల్డ్ నుండి పాబ్లో చటర్జీ మరియు కార్తీక్ వేర్, ఓవర్‌డ్రైవ్ నుండి రోహిత్ పరాద్కర్ మరియు బాబ్ రూపానీ, టైమ్స్ ఆటో నుండి అర్పిత్ మహేంద్ర, కార్ దేఖో.కాం/జిగ్ వీల్స్ నుండి అమేయా దండేకర్, టర్బోచార్జ్డ్ నుండి అభయ్ వర్మ, పవర్‌డ్రిఫ్ట్ నుండి సైరస్ ధాభర్ మరియు ది ప్రింట్ నుండి కుషాన్ మిత్రా ఉన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్