- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన స్పెషల్ ఎడిషన్లు
- స్పెషల్ ఎడిషన్ లిస్టులో లేని గ్లోస్టర్
ఎంజి కంపెనీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని రేంజ్ లో ఉన్న హెక్టర్, కామెట్, ZS ఈవీ, మరియు ఆస్టర్ కార్లలో స్పెషన్ ఎడిషన్లను లాంచ్ చేసి వేడుకలను ఘనంగా ఆరంభించింది. ఈ కార్లన్నీ బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్ వంటి స్పెషల్ కలర్ “ఎవర్ గ్రీన్” ని పొందాయి. ఈ కలర్ ఎంజి హెక్టర్, ZS ఈవీ, ఆస్టర్ మరియు కామెట్ ఈవీలలో అందుబాటులోకి వచ్చింది.
పైన పేర్కొన్న కార్లన్నీ బ్లాక్ రూఫ్ ని, టెయిల్ గేట్ పై “100-ఇయర్ ఎడిషన్” బ్యాడ్జి, ఫ్రంట్ హెడ్ రెస్ట్స్ పై “100-ఇయర్ ఎడిషన్” అనే ఎంబ్రాయిడరీతో ఆల్-బ్లాక్ థీమ్ ని పొందాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ కస్టమైజ్ విడ్జెట్ కలర్ తో పాటుగా “ఎవర్ గ్రీన్” అనే థీమ్డ్ హెడ్ యూనిట్ తో వచ్చింది.
ప్రస్తుతం ఈ కార్లలో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటుచేసుకోనప్పటికి, లిమిటెడ్ ఎడిషన్ లో భాగంగా ఎన్ని యూనిట్లు ఉత్పత్తి చేస్తుందో మాత్రం ఎంజి కంపెనీ పేర్కొనలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, దీనిని గ్లోస్టర్ మిస్ చేసుకోగా, మాకు తెలిసింది ఏంటి అంటే, దాని ఫ్లాగ్ షిప్ డీజిల్ ఎస్‍యూవీ చివరలో రానుంది. ఎంజి రేంజ్ లో సెంటినరీ ఎడిషన్ రెండవ స్పెషల్ ఎడిషన్ కాగా, ఇప్పటి వరకే ఇది హెక్టర్, గ్లోస్టర్, మరియు ఆస్టర్ కార్లలో బ్లాక్ స్టోర్మ్ ప్యాక్ వచ్చింది.
స్పెషల్ ఎడిషన్లను చూస్తుంటే, గత రెండు సంవత్సరాల్లో స్కోడా మరియు ఫోక్స్ వ్యాగన్ నుంచి వచ్చిన కలర్లుగా అనిపిస్తాయి. కియా మరియు హ్యుందాయ్ రెండవ స్థానంలో ఉండగా తాజాగా మారుతి స్విఫ్ట్ లో రెండు వెర్షన్లు రేసులో చేరింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్