- రూ.11,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ ప్రారంభం
- తిరిగి ప్రారంభమైన రూమియన్ సిఎన్‍జి బుకింగ్స్
టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) రూమియన్ మోడల్ రేంజ్ లో కొత్త వేరియంట్ ని తీసుకువచ్చింది, దీనిని మీరు కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. G ఎటి వేరియంట్ పిలువబడుతున్న ఈ కొత్త వేరియంట్ ధర రూ. 13 లక్షలు (ఎక్స్-షోరూం) కాగా, ఈ వేరియంట్ డెలివరీ మే నెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.
ముఖ్యంగా, టయోటా రూమియన్ సిఎన్‍జి వెర్షన్ కి విపరీతమైన డిమాండ్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో వీటి బుకింగ్స్ నిలిపివేయగా, టయోటా వాటి బుకింగ్స్ ని తిరిగి ప్రారంభించింది. ఇది ఇప్పుడు S వేరియంట్ లో ఎక్స్‌క్లూజివ్ గా రూ.11.39 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది.
ఇక రూమియన్ G ఎటి వేరియంట్ విషయానికి వస్తే, దీని 1.5-లీటర్, 4-సిలిండర్, కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 102bhp మరియు 137Nm టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడగా, ఈ కారు 20.51కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుంది.
కొత్త టయోటా రూమియన్ G ఎటి వేరియంట్లో ఉన్న హైలైట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, టయోటా ఐ-కనెక్ట్ టెక్నాలజీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్ మరియు ఇంజిన్ స్టార్ట్ -స్టాప్ బటన్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్