- 230 కిలోమీటర్ల డబ్లూఎల్టీపీ-క్లెయిమ్డ్ రేంజ్ ని అందించనున్న కొత్త మోడల్
- కొత్త డస్టర్ లాంచ్ తర్వాత ఇండియాలో అరంగేట్రం చేయనున్న రెనాల్ట్ క్విడ్
ఇండియాలో రెండు ఎ-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తో పాటుగా ఆరు కొత్త మోడల్స్ అరంగేట్రం చేయనున్నట్లు గత సంవత్సరం రెనాల్ట్-నిసాన్ సంయుక్తంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక ఎలక్ట్రిక్ కారు కొత్త రెనాల్ట్ క్విడ్ ఈవీ. డాసియా స్ప్రింగ్ ఈవీని డబ్ చేసినట్లుగా రాబోయే ఎలక్ట్రిక్ హ్యచ్ బ్యాక్ యొక్క డిజైన్ అంశాలు కొత్త డాసియా డస్టర్ లాగానే ఉండనున్నాయి.
ముందుగా, స్ప్రింగ్ ఈవీ ఫ్రంట్ గ్రిల్ పై తాజాగా డిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ని పొందనుంది. గ్రిల్ కి మధ్యలో భారీగా కనిపించే ‘DC’ లోగో ఉండనుండగా, అది ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఛార్జింగ్ ఫ్లాప్ లాగా పని చేస్తుంది. ఇంకా కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మరియు రూఫ్ రెయిల్స్ పై మరియు డోర్ క్లాడింగ్ పై బ్లూ యాక్సెంట్స్ ని మినహాయించి, సిల్హౌట్ దాని ఐసీఈ వెర్షన్ లాగానే ఉండనుంది. ఇక కారు వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు ట్వీక్డ్ బంపర్ మార్పులు ఉండనున్నాయి.
గ్లోబల్ గా, ఎలక్ట్రిక్ క్విడ్ యొక్క 26.8kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి 43bhp మరియు 125Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. దీని బ్యాటరీ ప్యాక్ ని 30kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఒక గంటలోపే 0-80 వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే దీని బ్యాటరీని ఒకే ఒక్క సింగిల్, ఫుల్ చార్జ్ తో 230 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని పొందవచ్చు.
ఇండియాలో లాంచ్ అయిన తర్వాత, క్విడ్ ఈవీ పంచ్ ఈవీ, సిట్రోన్ eC3, టియాగో ఈవీ మరియు ఎంజి కామెట్ ఈవీతో పోటీ పడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్