- కొత్త టాప్-స్పెక్ వేరియంట్ ని పొందిన eC3
- కొత్త అల్లాయ్ వీల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు మరెన్నో బెస్ట్ ఫీచర్లతో వచ్చిన కొత్త మోడల్
సిట్రోన్ ఇండియా eC3 రేంజ్ లో షైన్ అనే వేరియంట్ ని రూ. 13.20 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అధికారికంగా పరిచయం చేసింది. ఇంతకు ముందు ఉన్న టాప్-స్పెక్ ఫీల్ వేరియంట్ ని మరిపిస్తూ, దాని స్థానాన్ని షైన్ అనే కొత్త టాప్-ఎండ్ వేరియంట్ భర్తీ చేసింది.
ఫీచర్స్ పరంగా, సిట్రోన్ eC3షైన్ వేరియంట్ ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లు, 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, లెదర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం, రియర్ వైపర్ మరియు వాషర్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా అనే సరికొత్త ఫీచర్లను పొందింది. అంతేకాకుండా, ఇది ఆప్షనల్ డ్యూయల్-టోన్ కలర్ లో కూడా అందించబడుతుంది.
eC3 షైన్ వేరియంట్ యొక్క 29.2kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి 56bhp పవర్ మరియు 143Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఈ మోడల్ కేవలం 6.8 సెకన్లలో 0-60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది.
సిట్రోన్ eC3 షైన్ వేరియంట్ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
eC3 షైన్ | రూ. 13.20 లక్షలు |
eC3 షైన్ వైబ్ ప్యాక్ | రూ. 13.35 లక్షలు |
eC3 షైన్ డ్యూయల్-టోన్ | రూ. 13.35 లక్షలు |
eC3 షైన్ డ్యూయల్-టోన్ వైబ్ ప్యాక్ | రూ. 13.50 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్