- 2024 ద్వితియార్థంలో లాంచ్ అయ్యే అవకాశం
- పెట్రోల్ మరియు డీజిల్ పవర్ లో అందించబడనున్న కర్వ్ మోడల్
అదిరిపోయే లుక్
టాటా కర్వ్ ఎన్నోసార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించగా, ఈసారి మాత్రం స్పై పిక్చర్లలో దర్శనమిచ్చింది. అయితే, ఈ స్పై పిక్చర్లలో ఈసారి మేము టాటా నుంచి వస్తున్న మొదటి కూపేని అదిరిపోయే లుక్ లో చూశాము. రియర్-ఎండ్ ఫోటోలలో దీని లుక్ చాలా స్పష్టంగా కనిపించగా, గత సంవత్సరం కర్వ్ కాన్సెప్టు ద్వారా చెప్పిన విధంగానే ఇది ఉంది. స్పై ఫోటోలలో దీని వీల్స్ మరియు డిజైన్, ఫ్రంట్ లైట్స్ ప్యాకేజీ లేఅవుట్, మరియు భారీ స్లోప్ రూఫ్ లైన్ ని చూస్తూ ఉంటే, కారు బెస్ట్ సిగ్నేచర్ లుక్ ని కలిగి ఉంది.
కొత్త బాడీ స్టైల్ తో వస్తున్న కర్వ్
కర్వ్ మోడల్ పూర్తిగా కొత్త బాడీ స్టైల్ తో రానుండగా, ఆటో మార్కెట్లో ఇప్పటివరకు దీనిని పోలి ఉండే కారు రాలేదంటే నమ్మండి, అంతలా కారు బాడీ స్టైలింగ్ ని కలిగి ఉంది. బాడీ స్టైల్ విషయానికి వస్తే, సాధ్యమైన అన్ని విభాగాలలో టాటా దాని ఎస్‍యూవీ బేస్‌ను కవర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది.
ఇంజిన్ ఆప్షన్లు
ముందుగా మేము చెప్పినట్లు, టాటా నుంచి మొదటి కూపే ఎస్‍యూవీ వస్తున్న కర్వ్ ఎలక్ట్రిక్ మరియు ఐసీఈ వెర్షన్లలో టాటా కంపెనీ కర్వ్ మోడల్ ని లాంచ్ చేయనుంది. చివరిగా చెప్పిన ఐసీఈ వెర్షన్ ని టాటా నెక్సాన్ పవర్ ట్రెయిన్ నుంచి తీసుకోవచ్చని భావిస్తున్నాం. అలాగే, మొదటి వెర్షన్ కూడా నెక్సాన్ ఈవీ నుంచే తీసుకునే అవకాశం ఉంది. టాటా కంపెనీ 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కర్వ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో వస్తునట్లు నిర్దారించగా, అది 118bhp/260Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
ఇక పోటీ విషయానికి వస్తే, టాటా కర్వ్ సిట్రోన్ బసాల్ట్ తో పోటీ పడనుండగా, మహీంద్రా మరియు మారుతి సుజుకి కార్లతో కూడా పోటీ పడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్