- మరికొన్ని నెలల్లో ఇండియాలో అరంగేట్రం చేయనున్న కర్వ్ మోడల్
- ఎలక్ట్రిక్ వెర్షన్ లో కూడా లాంచ్ అవ్వనున్న టాటా కర్వ్
నిన్న అనగా బుధవారం రోజు రాబోయే టాటా కర్వ్ ఐసీఈకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేశాము. ఇప్పుడు, ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పోలో టాటా కంపెనీ దీనిని అధికారికంగా ప్రదర్శించింది. సిట్రోన్ C3X తో పోటీపడుతున్న కర్వ్ మోడల్ మరికొన్ని నెలల్లో ఇండియాలో అరంగేట్రం చేయనుంది. ప్రస్తుతం, భారత్ మొబిలిటీ ఎక్స్పో ద్వారా టాటా కర్వ్ తో పాటుగా టాటా కంపెనీకి చెందిన రాబోయే వివిధ మోడళ్లను ప్రదర్శిస్తున్నారు.
డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా, టాటా కర్వ్ సెడాన్ లాగా కనిపిస్తుంది, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ కొంతవరకు ఎత్తుగా కనిపిస్తున్నందున ఎస్యూవీలా ఉంది. దీని ఫ్రంట్ ఫాసియా చూస్తే, ఇతర టాటా మోడల్స్ లాగే ఉంది, కర్వ్ యొక్క సిల్హౌట్ కూడా ఒకే విధంగా ఉంది. ఇది కూపే లాంటి స్లాపింగ్ బాడీ లైన్ తో రూఫ్ ని కలిగి ఉంది మరియు సి-పిల్లర్ నుండి కారు వెనుక భాగం వరకు విశాలంగా స్ట్రెచ్ చేసినట్లుగా ఉంది. కొత్తగా ఇది ఫ్రెష్ గా డిజైన్ చేసిన 18- ఇంచ్ అల్లాయ్ వీల్స్ తో డ్రైవ్ ని ఆరంభించనుంది.
కర్వ్ డిజైన్ మరియు స్టైలింగ్
ఇంటీరియర్ పరంగా, కర్వ్ ఐసీఈ లోపల చూస్తే, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్-10.25- ఇంచ్ స్క్రీన్స్ తో వచ్చే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే, నెక్సాన్ ఫేస్లిఫ్ట్ లో ఉన్నట్లు అచ్చం అలాంటి ఎయిర్ కాన్ ప్యానెల్, వైర్లెస్ ఛార్జర్, పనోరమిక్ సన్రూఫ్, జెబిఎల్ స్పీకర్స్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లతో రానుంది.
ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్
హుడ్ కింద, కర్వ్ ఐసీఈ ఇప్పుడు 1.5-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ 113bhp పవర్ మరియు 260Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది కేవలం ఒకే ఒక్క 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్