- అత్యధికమైన వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉన్న టాప్-స్పెక్ వేరియంట్స్
- ఇండియాలో రూ. 14.03 లక్షలతో ప్రారంభంకానున్న ధరలు
ఇండియన్ ఆటోమేకర్ మహీంద్రా నుండి అత్యంత ప్రీమియం వెర్షన్ లో ఎక్స్యువి700 అందుబాటులో ఉంది. ఈ ఎస్యువి MX, AX3, AX5 మరియు AX7 వంటి 4 వేరియంట్స్ లో - 5 మరియు 7-సీట్ల కాన్ఫిగరేషన్లతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, ఎక్స్యువి700 ధర రూ. 14.03 లక్షల నుండి రూ. 26.57 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కథనంలో, మేము అక్టోబర్ 2023లో ఎక్స్యువి700 కి సంబంధించి వేరియంట్ వారీగా వెయిటింగ్ పీరియడ్‌ను లిస్ట్ చేసాము.
బేస్-స్పెక్ MX వేరియంట్‌తో ప్రారంభించినపుడు, ఇది 6 నుండి 8 వారాల వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉంది. అదే సమయంలో, AX3 మరియు AX5 వేరియంట్స్ వరుసగా 6 మరియు 11 వారాల వరకు డెలివరీ టైమ్‌లైన్‌ను కలిగి ఉన్నాయి. టాప్-స్పెక్ వెర్షన్ విషయానికొస్తే, కస్టమర్లు AX7 మరియు AXL వేరియంట్స్ ను కొనుగోలు చేయాలని భావించినపుడు వరుసగా వాటి డెలివరీని పొందడానికి 15 నుండి 21 మరియు 20 నుండి 25 వారాల వరకు వేచి ఉండాలి. ముఖ్యంగా, పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ సమానంగా ఉంటుంది.
మెకానికల్‌గా, ఎక్స్యువి700 రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తుంది. -అవి 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్. మొదటిది 197bhp మరియు 380Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. మరోవైపు, డీజిల్ మిల్ 182bhp మరియు 450Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. అదే విధంగా, టాప్-స్పెక్ డీజిల్ వేరియంట్స్ లో కూడా ఏడబ్ల్యూడి సిస్టమ్ ఆప్షన్ ను పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప