- ఈ సంవత్సరం చివరలో పరిచయం చేయబడనున్న థార్ ఫైవ్-డోర్
- ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో రానున్న ఫైవ్-డోర్ వెర్షన్
ఈ సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీన మహీంద్రా థార్ ఫైవ్-డోర్ వెర్షన్ ని లాంచ్ చేయడానికి మహీంద్రా కంపెనీ సన్నాహాలు చేస్తుండగా, దాని కంటే ముందుగా ఈ మోడల్ పబ్లిక్ రోడ్లపై మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. తాజా స్పై షాట్లను చూస్తే, ఈ లైఫ్ స్టైల్ ఎస్యూవీ ఎంట్రీ-లెవెల్ వెర్షన్ కి సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి.
ఇక్కడ ఫోటోలలో చూసిన విధంగా, కొత్త థార్ ఫైవ్-డోర్ ఎల్ఈడీ టెయిల్లైట్స్, ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్, స్టీల్ వీల్స్, రూఫ్ రెయిల్స్, ఫ్రంట్ డోర్-మౌంటెడ్ ఓఆర్విఎం మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి ఫీచర్లను పొందింది. టాప్-ఎండ్ వెర్షన్లతో పోలిస్తే, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, 10.25-ఇంచ్ స్క్రీన్ మరియు మరిన్ని ఫీచర్లను ఈ థార్ ఫైవ్-డోర్ బేస్ వేరియంట్ మోడల్ మిస్ అయ్యింది.
2024 మహీంద్రా థార్ ఫైవ్-డోర్ 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో పెట్రోల్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ తో రావచ్చని మేము అంచనా వేస్తున్నాం. ఇందులోని ట్రాన్స్మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సుల ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్