- ఇండియాలో అతి తక్కువ ధరలతో ఈ ఫీచర్ తో అందుబాటులో రానున్న మరిన్ని మోడల్స్
- ఏడీఏఎస్ సూట్ తో అందుబాటులో ఉన్న వెన్యూ
ఈ నెల ప్రారంభంలో, హ్యుందాయ్ తమ లైనప్ లో ఉన్న గ్రాండ్ i10 నియోస్, వెన్యూ, అల్కాజార్, ఆరా మరియు ఇతర కార్లలో 6-ఎయిర్ బ్యాగ్స్ ను స్టాండర్డ్ గా ఇవ్వనుంది. ఇదే అంశాన్ని హ్యుందాయ్ గ్లోబల్- ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో వెర్నాకు 5-స్టార్ లభించినపుడు తెలిపింది.
గ్రాండ్ i10 నియోస్
ప్రస్తుతం, హ్యుందాయ్ నుంచి వచ్చిన వివిధ మోడల్స్ అయిన అల్కాజార్, ఆరా, మరియు వెన్యూలలో సేఫ్టీ ఫీచర్స్ ని అప్ డేట్ చేసింది. ఇవన్నీ తమ వేరియంట్ లైనప్ లో స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ ని పొందనున్నాయి. హ్యుందాయ్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రెండు వైపులా ఎయిర్ బ్యాగ్స్, మరియు రెండు కర్టెయిన్ ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఉండనున్నాయి.
వెన్యూ
నెక్సాన్ కు పోటీగా ఉన్న సబ్ ఫోర్ మీటర్ ఎస్యువి వెన్యూలో స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడమే కాకుండా, ఏడీఏఎస్ ఫీచర్ ని కూడా ఇందులో అందించనుంది. లేటెస్ట్ అప్ డేట్ తో, ఈ ఎస్యువి ఫార్వార్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, మరియు ముందుగా ఉన్న వెహికిల్ డిపార్చర్ అలర్ట్ కూడిన పూర్తి ఏడీఏఎస్ సూట్ ని పొందింది.
అల్కాజార్
మైల్డ్ రీఫ్రెష్డ్ ఎస్యువి అల్కాజార్ లో సేఫ్టీ ఫీచర్స్ ని హ్యుందాయ్ కార్ మేకర్ అప్ డేట్ చేసింది. ఇక నుండి అల్కాజార్ లో స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. అప్ డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ లో రియర్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ వంటివి ఉన్నాయి. అలాగే తాజాగా అల్కాజార్ రాబోయే ఉద్గార నిబందనలకు అనుగుణంగా తమ ఇంజిన్స్ ని కూడా అప్ డేట్ చేసింది. అల్కాజార్ లో హ్యుందాయ్ ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్జి)ని పరిచయం చేసింది. ఇది ఇందులో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ ని యాక్టివేట్ చేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీని కూడా పెంచుతుంది.
ఆరా
మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, మరియు టాటా టిగోర్ లతో పోటీగా ఉన్న హ్యుందాయ్ ఆరాలో ఇకపై స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. ప్రస్తుతానికి, ఆరాను 4 వేరియంట్స్ లో పొందవచ్చు. అవి ఏవి అంటే, E, S, SX, మరియు SX(O). ఈ సెడాన్ లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 82bhp మరియు 114Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుండగా, సిఎన్జి వెర్షన్ 68bhp మరియు 95Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేరియంట్స్ లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ స్టాండర్డ్ గా ఉండగా, కొన్ని సెలెక్టెడ్ వేరియంట్స్ లో ఏఎంటీ యూనిట్ కూడా ఉంటుంది.
గత నెలలో ఇండియాలో జరిగిన ఒక ఈవెంట్ లో, హ్యుందాయ్ కంపెనీ భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ కోసం కొన్ని కార్లను వాలంటరీగా ఇస్తున్నట్లు ముందే వెల్లడించింది కానీ, మోడల్స్ గురించి మాత్రం తెలుపలేదు. దేశంలో 6-ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా అందిస్తున్న ఆటోమొబైల్ కంపెనీలలో మొదటి కంపెనీగా హ్యుందాయ్ నిలిచింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్