- ఇండియాలో రూ.16.77 లక్షలు(ఎక్స్-షోరూం)తో ధరలు ప్రారంభం
- పెట్రోల్ మరియు డీజిల్ టైప్స్ లో అందించబడుతున్న మోడల్
హ్యుందాయ్ కంపెనీ మార్చి నెలలో దాని కార్ల వెయిటింగ్ పీరియడ్ లిస్టును వెల్లడించింది. ఇది వరకే మేము ఎక్స్ టర్, వెర్నా, వెన్యూ, మరియు క్రెటా వెయిటింగ్ పీరియడ్ వివరాలను మీకు అందించాము. ఈ ఆర్టికల్ ద్వారా హ్యుందాయ్ నుంచి మరో మూడు-వరుసల ఎస్యూవీ అల్కాజార్ వెయిటింగ్ పీరియడ్ వివరాలను పరిశీలిద్దాం.
ప్రస్తుతం, హ్యుందాయ్ కంపెనీ కియా కారెన్స్ తో పోటీ పడుతున్న ఈ మోడల్ ని 6 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (O), ప్లాటినం, ప్లాటినం(O), సిగ్నేచర్, మరియు సిగ్నేచర్(O) అనే ఆరు వేరియంట్లలో అందిస్తుంది. ప్రస్తుత నెలలో, ఈ అన్ని వేరియంట్లపై ఒకే విధంగా బుకింగ్ చేసిన తేదీ నుంచి నాలుగు నుండి ఆరు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అయితే, ఈ పీరియడ్ ప్రాంతం, డీలర్షిప్, వేరియంట్, కలర్, పవర్ట్రెయిన్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.
బానెట్ కింద, అల్కాజార్ ని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. ఇందులో వరుసగా 158bhp/253Nm టార్కును ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 113bhp/250Nmటార్కును ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్