- మాక్సిమం వెయిటింగ్ పీరియడ్ కలిగి ఉన్నఎంట్రీ-లెవల్ వేరియంట్లు
- రూ. 6.13లక్షలతో ధరలు ప్రారంభం
హ్యుందాయ్ ఎక్స్టర్ గత ఏడాది జూలైలో లాంచ్ అయినప్పటి నుండి అమ్మకాలతో ఇండియన్ మార్కెట్లో మంచి పెర్ఫార్మెన్స్ తో కొనసాగుతుంది. ప్రస్తుతం టాటా పంచ్ కి పోటీగా ఉన్నదీనిని EX, EX (O), S, S (O), SX, SX (O), మరియు SX (O) కనెక్ట్ అనే ఏడు వేరియంట్లలో రూ.6.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు.
వెయిటింగ్ పీరియడ్ విషయానికొస్తే, ఈ నెలలో ఈ మోడల్‌ను బుక్ చేయాలనుకుంటున్న కస్టమర్లు, బుక్ చేసుకున్న తేదీ నుంచి కార్ డెలివరీ పొందడానికి 16 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. వరుసగా ఎంట్రీ-లెవల్ EX మరియు EX (O) మరియు టాప్-స్పెక్ పెట్రోల్ మాన్యువల్ SX (O) కనెక్ట్ వేరియంట్లు 14 నుండి 16 వారాలు మరియు 4 నుండి 6 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్నాయి. ఇంతలో, సిఎన్జి వేరియంట్లతో సహా అన్ని ఇతర వెర్షన్లపై 8 నుండి 10 వారాల వరకు ఒకేరీతిగా వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్నాయి.
వెర్షన్స్ | వెయిటింగ్ పీరియడ్ (వారాలు) |
EX మరియు EX (O) | 14-16 వారాలు |
SX (O) కనెక్ట్ మాన్యువల్ | 4-6 వారాలు |
అన్ని ఇతర వేరియంట్స్ (మాన్యువల్, ఎఎంటి, సిఎన్జి, మరియు డ్యూయల్-టోన్) | 8-10 వారాలు |
మెకానికల్‌గా, హ్యుందాయ్ ఎక్స్టర్లో ఈ బ్రాండ్ టెస్ట్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారు ఐదు-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ మోటార్ 81bhp మరియు 113Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అంతేకాకుండా, కస్టమర్లు S మరియు SX వేరియంట్లను ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్జి కిట్ ఆప్షన్ తో కూడా ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప