- లిమిటెడ్ వేరియంట్స్ తో అందుబాటులో వచ్చిన ఎలైట్ ఎడిషన్
- హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్ తో పాటుగా ఎలైట్ ఎడిషన్ లాంచ్
హోండా కార్స్ ఇండియా తమ పాపులర్ ఫ్యామిలీ సెడాన్ అయిన అమేజ్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ఎలైట్ ఎడిషన్‌తో ప్రారంభించింది. రూ. 9,03,900 (ఎక్స్-షోరూమ్) నుండి ధరలు ప్రారంభంకానున్నాయి, సెడాన్ ప్రత్యేక ఎడిషన్ VX వేరియంట్‌లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. ఆసక్తి కలిగిన కస్టమర్స్ బ్రాండ్ ఆన్‌లైన్ పోర్టల్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న హోండా అధికారిక డీలర్స్ ద్వారా సెడాన్ లిమిటెడ్ ఎడిషన్‌ను బుక్ చేసుకోవచ్చు.
అమేజ్ ఎలైట్ ఎడిషన్ లో ఎల్ఈడీతో కూడిన ట్రంక్ స్పాయిలర్, ఫ్రంట్ ఫెండర్ గార్నిష్, టైర్ ఇన్ ఫ్లేటర్, మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి ఫీచర్స్ ఉన్నాయి. అదనంగా, ఎలైట్ ఎడిషన్ లో సీటు అప్హోల్స్టరీతో పాటు స్టెప్ ఇల్యూమినేషన్ మరియు ఎలైట్ బ్యాడ్జ్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఓ ఆర్ వి ఎంలపై యాంటీ ఫాగ్ ఫిల్మ్‌ను కలిగి ఉంది.
పండుగ ఎడిషన్ లో కొత్త వేరియంట్స్ పరిచయంపై హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ డైరెక్టర్ యుయిచి మురాటా మాట్లాడుతూ, “మేము పండుగ సీజన్‌కు సిద్ధమవుతున్నందున, మా మోడళ్లను ప్రత్యేకమైన ప్రీమియం ప్యాకేజీతో మెరుగుపరచడంపైనే మేము మా దృష్టిని కేంద్రీకరించామని కొనుగోలుదారులకు తెలుపుతున్నాము. సిటీ మరియు అమేజ్ కొత్త ఎడిషన్స్ ను ఆకర్షణీయమైన ధరలలో, అద్బుతమైన ఫీచర్స్ తో మెరుగైన స్టైలింగ్ మరియు సౌకర్యాన్ని కొనుగోలుదారులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మన లైఫ్ లో పండుగలు జరుపుకోవడానికి ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, అవి ఎల్లప్పుడూ మన జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. మేము మా కస్టమర్‌లందరికీ కొత్త కారు కొనుగోలును మరింత సులువుగా చేయడానికి, అదే విధంగా వారికి వీటిని ఒక బహుమతిగా అందింస్తున్నాము. ఈ పండుగ సీజన్ ను మరింత ఘనంగా ప్రారంభించడానికి కొత్త లిమిటెడ్ ఎడిషన్స్ ప్రారంభంతో పాటు సిటీ మరియు అమేజ్ కి సంబంధించిన ఇతర వేరియంట్‌లపై అద్భుతమైన ఆఫర్స్ మరియు ప్రమోషన్స్ కూడా తీసుకువచ్చాం” అని పేర్కొన్నారు.
కొత్త హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూం ధరలు |
హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్ ఎంటి | రూ. 9,03,900 |
హోండా అమేజ్ ఎలైట్ ఎడిషన్ సివిటి | రూ. 9,85,900 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్