- లోయర్-స్పెక్ వేరియంట్స్ నిలిపివేత
- టాప్-స్పెక్ L&K వేరియంట్ పై భారీగా తగ్గిన ధర
స్కోడా ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువి కొడియాక్ వేరియంట్లలో కొత్తగా మార్పులను చేసింది. గతంలో స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు L&K అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉండే ఈమూడు-వరుసల ఎస్‌యువి ఇప్పుడు టాప్-స్పెక్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో ఆటోమేకర్ కొడియాక్ ధరలలో మార్పులు చేసింది.
స్కోడా కొడియాక్ ఇప్పుడు ఒకే ఒక్క -స్పెక్ L&K వేరియంట్‌లో రూ. 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు . ఈ మార్పులకు ముందు, ఈ ప్రత్యేక వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 41.99 లక్షలు గా ఉండేది. ఇది కాకుండా, కొడియాక్ ఎస్‌యువి యొక్క ఫీచర్ లిస్ట్‌లో ఆటోమేకర్ ఎటువంటి మార్పులు చేయలేదు.
మెకానికల్‍గా, స్కోడా యొక్క సాఫ్ట్-రోడర్ ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంది. ఈ మోటార్ 188bhp మరియు 320Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.అలాగే , ఎస్‌యువి స్టాండర్డ్‌గా ఫోర్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప