ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే కార్లను చూస్తే, చాలా వరకు కార్లు అన్ని ఎడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తో వస్తున్నాయి. క్రూయిజ్ కంట్రోల్ కొత్త ఫీచర్ ఏం కాదు కానీ, ఇండియన్ మార్కెట్ కి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కొత్తదే అని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము.
క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి ?
క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ అనేది కారును నిర్దిష్టమైన స్పీడ్ లో డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే, ఇది కారులో “క్రూయిజ్” అనే పేరుతో ఉంటుంది. సెట్ చేసిన స్పీడులో కారు వెళ్తుండగా యాక్సెలరేటర్ ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. సిస్టం కంట్రోల్స్ మరియు కొంతమేర ఆటోమేషన్ ని ఉపయోగించి కారును నిర్దిష్టమైన స్పీడులో డ్రైవ్ చేయవచ్చు.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి ?
పైన పేర్కొన్న ఆటోమేషన్ గురించి ఇంకా చెప్పాలంటే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అనేది టెక్ పరంగా మరింత అత్యాధునికమైన ఫీచర్. ఎడాస్ (ఏడీఏఎస్)తో వచ్చిన కార్లు అన్నీ చాలా వరకు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ని పొందాయి. ఒకసారి స్పీడ్ ని సెట్ చేశాక, కారు ఈ సిస్టం ద్వారా కంట్రోల్ చేయబడుతుంది కానీ, చుట్టూ ఉన్న ట్రాఫిక్ స్పీడ్ ప్రకారం కారు కదులుతుంది. ఒకవేళ మీ ముందు కారు 40కెఎంపిహెచ్ వేగంతో వెళ్తుంటే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ దానికి తగ్గట్టు దూరాన్ని క్రమబద్దీకరిస్తూ మీ కారును కూడా అంతే స్పీడులో ఉంచుతుంది. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, సిస్టంతో అనుసంధానించబడి ఆటోమేటిక్ బ్రేకింగ్ ద్వారా డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు వేగం తగ్గడం/కారు ఆగిపోవడం జరుగుతుంది.
క్రూయిజ్ కంట్రోల్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తాయి?
క్రూయిజ్ కంట్రోల్ సిస్టం యాక్చువేటర్ ని ఉపయోగించి ఫ్యూయల్ ని కంట్రోల్ చేసే పరికరం మరియు ప్రీ-సెట్ స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇదే విధమైన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లో ఉపయోగిస్తుండగా, ఎడాస్ (ఏడీఏఎస్) ద్వారా బ్రేకులను అప్లై చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ లో మరియు హైవేలపై ఈ ఫీచర్ అచ్చం సాధారణ డ్రైవర్ల మాదిరిగానే కారును వేగాన్ని యాక్సలరేట్ చేయడం మరియు బ్రేక్ వేయడం చేస్తుంది.
క్రూయిజ్ కంట్రోల్ ని ఎలా ఉపయోగించాలి?
సాధారణంగా, కారు వేగాన్ని సెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి, పెంచడానికి మరియు తగ్గించడానికి స్టీరింగ్ వీల్‌పై లేదా స్టీరింగ్ వీల్ వెనుక బటన్లు ఉంటాయి. కొన్ని కార్లు డాష్‌బోర్డ్‌లో యాక్టివేషన్ బటన్‌ను కలిగి ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా, ఫంక్షన్ ఒకేలా ఉంటుంది, అంటే, దానిని యాక్టివేట్ చేయడం/ డియాక్టివేట్ చేయాలి. మీరు '+/-' బటన్‌లను ఉపయోగించి స్పీడ్ ని అడ్జస్ట్ చేయవచ్చు, 'సెట్'ని ఉపయోగించి దాన్ని పరిష్కరించవచ్చు మరియు 'క్యాన్సిల్'తో క్యాన్సిల్ చేయవచ్చు. క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కార్లలో, బ్రేక్‌ల అప్లికేషన్‌తో సిస్టమ్ కంట్రోల్ ఏమైనప్పటికీ క్యాన్సిల్ చేయబడుతుంది. అదనంగా, 'రీసెట్'తో, సెట్ స్పీడ్ యొక్క చివరి రికార్డుని రీకాల్ చేయవచ్చు.
ఇండియాలో క్రూయిజ్ కంట్రోల్ కార్లు
ఇంతకు ముందు, కేవలం టాప్-ఎండ్ కార్లలో మాత్రం ఈ ఫీచర్ ఉండేది. కానీ, ఇప్పుడు రూ.10 లక్షల లోపు బడ్జెట్ కార్లలో కూడా క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. దీనికి ప్రధానమైన ఉదాహరణలుగా హ్యుందాయ్ నియోస్ మరియు టాటా పంచ్ అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ టాప్-స్పెక్ వేరియంట్లకు మాత్రమే పరిమితం కాకుండా, లోయర్ మిడ్-స్పెక్ వేరియంట్లలో కూడా వస్తుంది.
ముఖ్య గమనిక: ఈ టెక్ ఫీచర్ గురించి మేము షేర్ చేసిన సమాచారంపై మీరు పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది సేఫ్ అని భావిస్తేనే దీనితో ఎంగేజ్ అవ్వండి మరియు పూర్ లైటింగ్, మంచు, వర్షం కురిసే సమయాల్లో, ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేనప్పుడు మాత్రమే ఉపయోగించండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్