- 2 శాతం మేర పెరగనున్న ఎక్స్-షోరూం ధరలు
- లైనప్ లో ఉన్న అన్నీ మోడల్స్ పై పెరిగిన ధరలు వర్తింపు
స్కోడా ఇండియా నుంచి అందుబాటులో ఉన్న వివిధ మోడల్స్ పై ధరలను పెంచుతున్నట్లు ఆటోమేకర్ వెల్లడించింది. పెరిగిన ధరలు 1 జనవరి, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. అదే విధంగా పెరిగిన ధరలు ఆయా మోడల్స్, వేరియంట్స్, ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి, ఇండియాలో ఈ బ్రాండ్ నుంచి 3 మోడల్స్ విక్రయించబడుతున్నాయి. కుషాక్ మరియు స్లావియా మోడల్స్ ను బ్రాండ్ ద్వారా ఎంక్యూబీ ఏఓ ఐఎన్ప్లాట్‌ఫారమ్‌పై స్థానికంగా తయారు చేశారు మరియు ఇటీవల లాంచ్ చేయబడిన మాట్ మరియు ఎలిగెన్స్ ఎడిషన్స్ వంటివి విభిన్నమైన స్పెషల్ వెర్షన్స్ లో అందించబడతాయి.
అదే విధంగా, స్కోడా నుంచి వచ్చిన కొడియాక్ మోడల్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 188bhp మరియు 320Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టైల్, స్పోర్ట్ లైన్, మరియు ఎల్&ఎల్ వేరియంట్స్ లో రూ. 38.50 లక్షలు(ఎక్స్-షోరూం) ధరతో అందుబాటులో ఉంది.
తాజాగా స్కోడా ఇండియా ఆంధ్రప్రదేశ్ మరియు చెన్నైలో నివసిస్తున్న సైక్లోన్-ప్రభావిత కస్టమర్లకు ఉచితంగా రోడ్ సైడ్ సేఫ్టీ అసిస్టెన్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్