- ఇండియాలో రూ.7.99 లక్షలతో ప్రారంభంకానున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ధరలు
- 7 వేరియంట్లు మరియు 11 కలర్లలో లభ్యం
ఇండియాలో ఈ నెల ప్రారంభంలో కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ రూ.7.99 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. మరికొన్ని రోజుల్లో ఈ కార్ మేకర్ అప్‍డేటెడ్ సబ్-4-మీటర్ ఎస్‍యూవీ యొక్క డెలివరీలను ప్రారంభించనుంది.
ప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్స్ వద్దకు 2024 సోనెట్ యొక్క బేస్ వేరియంట్ చేరుకోవడం ప్రారంభమైంది. ఈ మోడల్ ని చూస్తే, ఇందులో హాలోజెన్ హెడ్ ల్యాంప్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, వీల్ కవర్స్ తో స్టీల్ వీల్స్, బాడీ కలర్డ్ ఓఆర్‌విఎం మరియు డోర్ హ్యండిల్స్, రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ లైట్ బార్, మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా ఉన్నాయి. అదే విధంగా, టాప్ వేరియంట్ తో పోలిస్తే ఎక్స్‌టీరియర్ డిజైన్ లో రూఫ్ రెయిల్స్, ఫాగ్ లైట్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, మరియు డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటి వాటిని 2024 సోనెట్ మిస్ అయినట్లు కనిపిస్తుంది.
ఇంటీరియర్ పరంగా, ఎంట్రీ-లెవెల్ అవతార్ ఫేస్‍లిఫ్టెడ్ సోనెట్ లో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు టిపిఎంఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అదే విధంగా, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-1ఏడీఏఎస్(అడాస్), వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఓటీఏఅప్‌డేట్స్ తో పాటుగా మరికొన్ని ఫీచర్స్ లేవు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, బేస్ వేరియంట్ (HTE 1.2 పెట్రోల్ ఎంటి) ధర రూ.7.99 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ (X లైన్ డీజిల్ ఎటి) ధర రూ.15.69 లక్షలుగా (అన్నీ ధరలు, ఎక్స్-షోరూం) ఉంది. ఆసక్తి కలిగిన కస్టమర్లు 2024 సోనెట్ ను 3 ఇంజిన్లు, 11 కలర్లు మరియు 7 వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్