- ఐదు వేరియంట్లలో అందించబడుతున్న 2024 స్విఫ్ట్
- కేవలం పది రోజుల్లో 10 వేలకు పైగా బుకింగ్స్ దీని సొంతం
ఈ నెల 9వ తేదీన మారుతి సుజుకి కంపెనీ సరికొత్త ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ ని ఇండియాలో లాంచ్ చేసింది. అప్ డేటెడ్ హ్యచ్ బ్యాక్ ఐదు వేరియంట్లలో అందించబడగా, దీని ఎక్స్–షోరూం ప్రారంభ ధర రూ.6.49 లక్షలుగా ఉంది. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మోడల్ 10 వేలకు పైగా ఆర్డర్లను అందుకుంది. ఇప్పుడు, 2024 స్విఫ్ట్ దాని లాంచ్ తర్వాత కస్టమర్లను చేరుకోవడం కూడా ప్రారంభమైంది.
కొత్త మారుతి స్విఫ్ట్ ని LXi, VXi, VXi (O), ZXi, మరియు ZXi+ అనే ఐదు వేరియంట్లలో పొందవచ్చు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వేరియంట్ ఎంట్రీ-లెవెల్ LXi వేరియంట్ కాగా, ఇది రూ. 6.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అదే విధంగా, కొత్త స్విఫ్ట్ టాప్-స్పెక్ వెర్షన్ ధర రూ.9.64 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది.
డిజైన పరంగా, పాత ధర్డ్ జనరేషన్ స్విఫ్ట్ తో పోలిస్తే కొత్త స్విఫ్ట్ అగ్రెసివ్ లుక్ మరియు యాంగులర్ స్టైలింగ్ ని పొందింది. ఇది కొత్త గ్రిల్, డీఆర్ఎల్స్ తో స్లీకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రీడిజైన్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్ సెట్, మరియు డోర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇంటీరియర్ పరంగా, కొత్త స్విఫ్ట్ క్యాబిన్ పూర్తిగా రీవర్క్ చేయబడగా, 9-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం కోసం కొత్త డ్యాష్ బోర్డును పొందింది. అలాగే ఇది వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్ లెస్ ఛార్జర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రియర్ ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లతో అందించబడింది.
న్యూ-జెన్ స్విఫ్ట్ లో అతి పెద్ద మార్పు ఏంటి అంటే, ఈ కారు జెడ్-సిరీస్ 3-సిలిండర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనే కొత్త ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ మెరుగైన మైలేజీని అందించడంతో పాటుగా 80bhp మరియు 112Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి కొనసాగుతుంది. ఇక దీని మైలేజీ వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకంటే ఇది ఒక లీటరుకు 25 కిలోమీటర్లకు మైలేజీని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్