- కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్ లో లాంచ్ అయిన XUV 3XO
- XUV 3XO మోడల్ గా వచ్చిన అప్‌డేటెడ్ XUV300
మహీంద్రా ఇటీవల వివిధ టీజర్‌లను రిలీజ్ చేసిన తర్వాత ఇండియా అంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XUV 3XOని లాంచ్చేసింది. అలాగే, ఇండియాలో వివిధ ప్రాంతాల్లో ఈ కార్ పై టెస్ట్ జరుగుతుండగా, అంతకుముందే ఆన్‌లైన్‌లో అనేక స్పై షాట్‌స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ కార్ లాంచ్ అయిన తర్వాత, మొదటి డ్రైవ్ రివ్యూ నుండి కాంపాక్ట్ ఎస్‌యువిచిత్రాలు ఇక్కడ ఉన్నాయి.
మహీంద్రా 3XOఫోటో గ్యాలరీ
న్యూ XUV 3XO కాస్మోటిక్ అప్‍గ్రేడ్స్ లో న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రివైజ్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్ ఉన్నాయి. ఇది న్యూ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.
ఈ కార్ లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యూ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ఏడీఏఎస్ (ఎడాస్) సూట్‌తో సహా పొందవచ్చు.
ఎంట్రీ లెవల్ ఎంపిఎఫ్ఐ పెట్రోల్ వేరియంట్ రూ. 7.49 లక్షలు ధరతో అందుబాటులో ఉండగా, అయితే AX7 లగ్జరీ అనే టాప్-స్పెక్ టిజిడిఐ పెట్రోల్ వేరియంట్ రూ.15.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)ధరతో అందుబాటులో ఉంది.
మరోవైపు డీజిల్ యూనిట్లుగా ఉన్న MX2 వెర్షన్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు ఉండగా, మరియు AX7 లగ్జరీ అనే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14.99 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉంది.
వేరియంట్స్ వారీగా దీనిని 5 వేరియంట్స్ లో ఎంచుకోవచ్చు,అందులో ఎంట్రీ-లెవల్ MX1, తర్వాత MX2, MX3, AX5 మరియు AX7 ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇవి ప్రో మరియు లగ్జరీ ప్యాక్ వెర్షన్లలో కూడా లభిస్తాయి.
మహీంద్రా 3XO పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
మెకానికల్‍గా, కాంపాక్ట్ ఎస్‌యువి ముందున్న XUV300 లో ఉన్న అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఇందులో కూడా కొనసాగుతాయి. అందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.
స్టాండర్డ్ గా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 109bhp మరియు 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.
అదే విధంగా, 1.2-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ 129bhp మరియు 230Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఎంటి లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.
మరోవైపు, ఆయిల్ బర్నర్ 1.5-లీటర్ డీజిల్ యూనిట్ 115bhp మరియు 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో6-స్పీడ్ ఎంటి లేదా 6 -స్పీడ్ ఏఎంటీ ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప