- 2024లో అప్‌డేట్ చేయబడిన కియా కారెన్స్
- ఇప్పుడు 30 వేరియంట్లలో లభ్యం
కియా ఇండియాలో కారెన్స్ మరియు సెల్టోస్ కార్ల వేరియంట్‌లలో మార్పులు చేస్తూ మరియు కొత్త ఫీచర్ల జోడింపుతో వీటిని అప్‌డేట్ చేసింది. ఈ ఎంపివిని ఇప్పుడు వివిధ ధరలలో అదనపు వేరియంట్ ఆప్షన్స్ తో కియా అందిస్తుంది. అలాగే, కారెన్స్ యూఎస్ పీ మొదటి టాప్- 5 మార్పులు ఇక్కడ ఉన్నాయి.
అందుబాటులో ఉన్న డీజిల్ మాన్యువల్
ఈ కార్‌మేకర్ ముందుగా డీజిల్ మాన్యువల్ వేరియంట్‌లను నిలిపివేయగా, అయితే, 2024 మోడల్ అప్‌డేట్ చేసిన వాటిని మళ్ళీ తీసుకువస్తుంది.ఇందులో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ స్టాండర్డ్ గా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.
మరిన్ని ఫీచర్లతో X-లైన్
ఇప్పుడు, రేంజ్-టాపింగ్ X-లైన్ వేరియంట్ కూడా సెవెన్-సీటర్ కాన్ఫిగరేషన్‌ను పొందుతుంది.కొనుగోలుదారులు డాష్‌క్యామ్ ని పొందడమే కాకుండా వాయిస్ కమాండ్‌లతో అన్ని విండోస్ ఆటోమేటిక్ గా పైకి క్రిందికి జరిపే వంటి అదనపు ఫీచర్‌లను పొందింది.
న్యూ ప్రెస్టీజ్+ (O)వేరియంట్
ఇప్పుడు కారెన్స్ రెండు కొత్త వేరియంట్ లను పొందింది. ప్రెస్టీజ్+ (O) వేరియంట్ 7-స్పీడ్ డిసిటి మరియు 6-స్పీడ్ ఏటీ మోడల్‌లలో అందించబడుతుంది. ఇది ఎల్ఈడీ మ్యాప్ ల్యాంప్, రూమ్ ల్యాంప్ మరియు సన్‌రూఫ్‌తో అమర్చబడి ఉంటుంది.
న్యూ ప్రెస్టీజ్ (O)వేరియంట్
మరోవైపు, న్యూ ప్రెస్టీజ్(O) వేరియంట్ 6 లేదా 7-సీటింగ్ కెపాసిటీని అందిస్తుంది. ఇది 8-ఇంచ్ డిజిటల్ ఆడియో సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, బర్గ్లర్ అలారం మరియు షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, పొజిషనింగ్ ల్యాంప్, ఎల్ఈడీ రియర్ కాంబినేషన్ ల్యాంప్, పుష్-బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ మరియు లెదర్‌తో చుట్టబడిన గేర్ నాబ్‌ను పొందుతుంది.
న్యూ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్
కియా మోటార్స్ సోనెట్ మరియు సెల్టోస్ వంటి మూడు-వరుసల కార్ లో ప్యూటర్ ఆలివ్ కలర్ ఆప్షన్ ను కూడా చేర్చింది. అలాగే, కస్టమర్‌లు ఇప్పుడు దీనిని 8 మోనోటోన్ మరియు మూడు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్‌లలో కూడా ఎంచుకోవచ్చు.
2024 కియా కారెన్స్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ స్పెసిఫికేషన్స్
కియా కారెన్స్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మరియు టర్బో యూనిట్ అనే రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి ఉన్నాయి. మరోవైపు, కారెన్స్ 1.5-లీటర్ డీజిల్ మోటార్ 113bhp మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ క్లచ్-లెస్ మాన్యువల్ (ఐఎంటి) లేదా 6-స్పీడ్ టార్క్- కన్వర్టర్ (టిసి) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప