- ఈ సంవత్సరం ప్రారంభంలో అప్‌డేట్ చేయబడిన XUV400
- త్వరలో 8కొత్త వేరియంట్స్ లో లభ్యం
ప్రస్తుత సంవత్సరం ప్రారంభంలో, మహీంద్రా XUV400 లైనప్‌లో ప్రో వేరియంట్‌లను లాంచ్ చేసింది, దీని ధరలు రూ. 15.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యాయి.ఇప్పుడు, లీక్ అయిన డేటా ప్రకారం, కార్‌మేకర్ మరికొన్ని నెలల్లో XUV400 వేరియంట్ రేంజ్ ని విస్తరించే అవకాశం ఉంది.
లీక్ అయిన డేటా ప్రకారం, మహీంద్రా XUV400 8 కొత్త వేరియంట్‌లు నమోదు చేయబడ్డాయి, అవి EC L, EC L(O), EC LL, EL LL(O), EL LH, EL LH(O), EL PH మరియు EL PH(O). ఇంకా ఇందులో, 34.3kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 402కిమీ (27కిమీపెరుగుదల) రేంజ్ ని అందించేలా సర్దుబాటు చేయబడుతుంది, అయితే కొత్త సెల్‌లతో కూడిన 39.4kWh బ్యాటరీ ప్యాక్ 444కిమీ రేంజ్ ని అందించనుంది. ముఖ్యంగా చెప్పాలంటే, సేల్‌లో ఉన్న ప్రస్తుత మోడల్‌లో 39.4kWh బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్ గా అందించబడగా, ఇందులో ఎలాంటి మార్పు లేదు. అలాగే, ఇది 456కిమీ రేంజ్ ని అందిస్తుంది.
పవర్ అవుట్‌పుట్ పరంగా కూడా, కొత్త మహీంద్రా XUV400 150bhp ఉత్పత్తి చేస్తుందిటార్క్ ను గూర్చిన వివరాలు ఇంకా క్లియర్ గా లేనందున, ఇది 310Nm టార్కును ఉత్పత్తి చేస్తుందనిమేము భావిస్తున్నాము.హుడ్ కింద చేయబడిన మార్పులు కాకుండా, XUV400 అదే ఫీచర్ సెట్ మరియు స్టైలింగ్ లతో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప