పరిచయం
ఇప్పుడు మార్కెట్లో కొత్త కాంపాక్ట్ ఎస్‍యూవీలు ఎన్నో వస్తున్నాయి. అందులో ఇప్పుడు మనం కొత్త టాటా నెక్సాన్ మరియు మహీంద్రా XUV 3XO వంటి రెండింటి గురించి తెలుసుకుందాం. ఇవి ఫీచర్-రిచ్ కార్లుగా, ఒకే రకంగా కనిపిస్తున్నాయి, టర్బో-పెట్రోల్ తో రాగా, టూ-పెడల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ రెండింటి ధరలు చాలా దగ్గరగా ఉన్నాయి (వ్యత్యాసం చాలా తక్కువ). బెస్ట్ ఫీచర్లు, అప్పియరెన్స్ (లుక్), మరియు బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ని ఆస్వాదించాలని కోరుకునే కస్టమర్లకు ఈ రెండూ గట్టిపోటీనిస్తాయి.
XUV 3XO vs నెక్సాన్: డిజైన్ హైలైట్స్
ఇక టాస్క్ లోకి వెళ్తే, ఈ రెండు వెహికిల్స్ కి సంబంధించిన ఎక్స్‌టీరియర్ డిజైన్ గురించి చెప్పాలి. ఒక వైపు, XUV 3XO లుక్ చూస్తేస్క్వేర్ టైప్ లో కనిపిస్తున్నా, భారీ బూట్ స్పేస్, పొడవైన బానెట్, మరియు భారీ వీల్స్ కారును టాప్ పొజిషన్ లో ఉంచేలా చేస్తున్నాయి. మరోవైపు, ఇక నెక్సాన్ విషయానికి వస్తే, మొదటి కూపే ఎస్‍యూవీ పోటీ ఇస్తుంది మరియు దీని లుక్ ఏడేళ్ళ నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది. ఇక XUV 3XO వర్సెస్ నెక్సాన్ లో, నెక్సాన్ లుక్ ముందు నుంచి భారీగా కనిపిస్తుంది కానీ, XUV’ యొక్క టెయిల్ ల్యాంప్ మరింత మోడరన్ గా కనిపిస్తుంది మరియు ఇది షార్పర్-లుక్ వీల్స్ ని కలిగి ఉంది.
ఓవరాల్ గా ఈ రెండు కార్లలో ఫ్రంట్ ఆక్యుపెంట్ ఎక్స్ పీరియన్స్ తో ఒకే విధమైన ఇంటీరియర్ ని కలిగి ఉన్నాయి. నెక్సాన్ మరియు అదే విధంగా 3XOలో, డ్యూయల్-డిజిటల్ డిస్ ప్లేలు, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్లీ మౌంటెడ్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం, మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి. కర్వ్డ్ రూఫ్ లైన్ కారణంగా నెక్సాన్ కారు రెండవ వరుసలో కొంత వరకు గేద రూమ్ ని కోల్పోగా, ఓవరాల్ గా ఈ రెండు కార్లు ఒకే విధమైన ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయి. ఈ కార్ల డైమెన్షన్లు ఓకే రకంగా ఉన్నాయి, నెక్సాన్ బూట్ స్పేస్ 382 లీటర్లు ఉండగా, మహీంద్రా XUV 3XO బూట్ స్పేస్ 364 లీటర్లుగా ఉంది.
XUV 3XO vs నెక్సాన్: ఫీచర్ లిస్టు
ఇక్కడ మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఫీచర్ల పరంగా టాప్-స్పెక్ మోడల్స్ లో ఉన్న ఫీచర్లను చూస్తే, ఈ రెండు కార్లు డ్యూయల్-డిజిటల్ స్క్రీన్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఒకే రకమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. మొత్తం మీద చూస్తే, నెక్సాన్ కంటే ముందుగా ఫుల్లీ లోడెడ్ XUV 3XO లెవెల్-ఎడాస్(ఏడీఏఎస్) మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి రెండు ఫీచర్లను పొందింది. ఈ రెండూ సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లుగా ఇందులో అందించబడ్డాయి.
నెక్సాన్ మరియు XUV 3XO: పవర్ ట్రెయిన్స్
ఒకవేళ మనం టాప్-స్పెక్ టర్బో పెట్రోల్ మోడల్స్ ని పోల్చి చూస్తే, XUV 3XO 1.2-లీటర్ జిడిఐ ఇంజిన్ 129bhp/230Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, నెక్సాన్ యొక్క టర్బో-పెట్రోల్ 118bhp/170Nm ఉత్పత్తి చేస్తుంది. మొదట పేర్కొన్న ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడగా, రెండవ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడింది.
పెర్ఫార్మెన్స్
XUV 3XO vs నెక్సాన్: రియల్ వరల్డ్ మైలేజీ
నెక్సాన్
అధికారికంగా, నెక్సాన్ ఒక లీటరుకు 17 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని క్లెయిమ్ చేయగా, మేము నిర్వహించిన రియల్-వరల్డ్ టెస్టులలో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే(ఎంఐడి)లో ద్వారా 11.3కెఎంపిఎల్ చూపించగా, సిటీ కండీషన్లలో లీటరుకు 9.1 కిలోమీటర్ల మైలేజీని అందించింది. అదేవిధంగా, హైవేలపై 16.6కెఎంపిఎల్ అందించగా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లేలో 18.2కెఎంపిఎల్ చూపించింది. ఇది మాకు యావరేజ్ గా 10.8కెఎంపిఎల్ మైలేజీని అందించింది మరియు దీని ఫ్యూయల్-ట్యాంక్ కెపాసిటీ 44 లీటర్లుగా ఉంది. ట్యాంక్-టు-ట్యాంక్ రేంజ్ పరంగా ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ ని ఫుల్ చేస్తే 476 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయవచ్చు.
XUV 3XO
అధికారికంగా, XUV 3XO 18.2కెఎంపిఎల్ (క్లెయిమ్డ్) మైలేజీని అందిస్తున్నట్లు పేర్కొంది. మేము నిర్వహించిన రియల్-వరల్డ్ టెస్టులలో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే(ఎంఐడి)లో ద్వారా 10.2కెఎంపిఎల్ చూపించగా, సిటీ కండీషన్లలో లీటరుకు 9.6 కిలోమీటర్ల మైలేజీని అందించింది. అదేవిధంగా, హైవేలపై 18.08కెఎంపిఎల్ మైలేజీని అందించగా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లేలో 18.9కెఎంపిఎల్ మైలేజీ చూపించింది. ఇది మాకు యావరేజ్ గా 11.7కెఎంపిఎల్ మైలేజీని అందించింది మరియు దీని ట్యాంక్ కెపాసిటీ 42 లీటర్లుగా ఉంది. ట్యాంక్-టు-ట్యాంక్ రేంజ్ పరంగా ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ ని ఫుల్ చేస్తే 492 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయవచ్చు.
ఫైనల్ రిజల్ట్
ఈ రెండు కార్ల మధ్య కేవలం రూ.49,000 వ్యత్యాసం మాత్రమే ఉంది, మరియు XUV 3XOని మీరు లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్)తో కొనుగోలు చేయవచ్చు మరియు నెక్సాన్ పై మూడేళ్ళ వారంటీ లాగా వారంటీపై అన్ లిమిటెడ్ కిలోమీటర్ లిమిట్ ని పొందవచ్చు. చివరగా, 3XO వర్సెస్ నెక్సాన్ విషయానికి వస్తే, మోస్ట్ పవర్ ఫుల్ ఇంజిన్ మరియు డ్రైవర్ అసిస్టెన్స్ ప్యాకేజీతో మహీంద్రా XUV 3XO మోడల్ నెక్సాన్ కారుపై పైచేయి సాధించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్