- నెక్సాన్ పవర్‌ట్రెయిన్‌ను పోలి ఉండే అవకాశం
- 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్ మరియు మరిన్ని ఫీచర్లతో లభించనున్న మోడల్
టాటా మోటార్స్ ప్రస్తుతం హ్యుందాయ్ i20 N లైన్ కి గట్టి పోటీని అందించే పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కొత్త కార్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సరికొత్త ఆల్ట్రోజ్ రేసర్ జూన్ 2024 ప్రథమార్థంలో ఇండియాలో లాంచ్ కానుంది.
టాటా ఆల్ట్రోజ్ రేసర్ ఇండియాలో ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడింది. అప్పటి నుండి, ఈ మోడల్ 2024 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో అధికారిక ప్రదర్శనతో పాటు అనేకసార్లు టెస్టింగ్ ను కొనసాగిస్తూ కనిపించగా, డిజైన్ వారీగా, ఆల్ట్రోజ్ రేసర్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ను జోడిస్తూ స్పోర్టి లుక్స్ ని ప్రదర్శిస్తుంది.అందులో బ్లాక్-అవుట్ హుడ్, రూఫ్, ఒఆర్‍విఎంఎస్ మరియు పిల్లర్స్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, దీని లుక్ ని మరింతగా మెరుగుపరుస్తూ, ఆల్ట్రోజ్ రేసర్ రూఫ్ మరియు బానెట్‌పై డ్యూయల్ వైట్ స్ట్రిప్స్‌ను కలిగి ఉంటుంది.
ఫీచర్ల విషయానికొస్తే, టాటా ఆల్ట్రోజ్ రేసర్ పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-ఎనేబుల్డ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం పెడల్స్, రెడ్ స్టిచింగ్ మరియు యాక్సెంట్స్, మరియు 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి ఫీచర్లతో రానుంది.
మెకానికల్‍గా, టాటా ఆల్ట్రోజ్ రేసర్, నెక్సాన్ ఇంజిన్ ను పోలి ఉన్న1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ ను పొందనుంది. ఈ మోటార్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 120bhp మరియు 170Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పోటీ విషయానికి వస్తే, ఆల్ట్రోజ్రేసర్ హ్యుందాయ్ i20 N లైన్‌కు కాంపీటీషన్ గా మారనుంది, అయినప్పటికీ, ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజాతో కూడా పోటీపడనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప