- ఇండియాలో, విదేశాల్లో పలుమార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించిన క్లావిస్
- టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లతో పోటీపడనున్న కొత్త మోడల్
కియా ఇండియా కంపెనీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూనే ఉంది. మోడల్ టెస్ట్ మ్యూల్స్ పబ్లిక్ రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా తాజా స్పై ఫోటోలు కూడా బహిర్గతమయ్యాయి. ఇప్పుడు, కియా ఒక కొత్త ట్రేడ్ మార్కును రిజిస్టర్ చేయగా, దీనిని ఇండియా-స్పెక్ క్లావిస్ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.
కియా సైరోస్ గా పిలువబడుతున్న ఇది ఇండియన్ మార్కెట్లో అధికారికంగా కియా క్లావిస్ అనే పేరుతో వచ్చే అవకాశం ఉంది. ఇండియాకి చేరుకున్న తర్వాత క్లావిస్ B-SUVహ్యుందాయ్ ఎక్స్‌టర్ మరియు టాటా పంచ్ వంటి కార్లతో పోటీపడనుంది. ముఖ్యంగా చెప్పాలంటే, సోనెట్ సబ్-మీటర్ ఎస్‍యూవీ కంటే తక్కువలో ఇది రానుండగా, కొరియన్ బ్రాండ్ నుంచి ఇండియాలో అత్యంత చవకగా అందించబడే అవకాశం ఉంది.
కియా క్లావిస్ ప్రపంచవ్యాప్తంగా ఆవష్కరించబడనుండగా, ప్రస్తుతం దీనిని సంబంధించిన అధికారిక వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. స్పై షాట్స్ ద్వారా కొన్ని కీలక వివరాలు వెల్లడవ్వగా, వాటి వివరాలు మీ వెబ్ సైట్ ని సందర్శించి చదువగలరు. కియా B-SUV 1.2-లీటర్, 4-సిలిండర్, ఎన్ఎ పెట్రోల్ మోటార్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్