- పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానున్న పంచ్ ఈవీ
- మరికొన్ని నెలల్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం
టాటా మోటార్స్ పంచ్ ఈవీ అద్బుతమైన ప్లాన్స్ ద్వారా ఇండియన్ మార్కెట్లో పెద్ద ఎత్తున దూసుకుపోతోంది. నెక్సాన్ ఈవీ సక్సెస్ ఫుల్ రన్ తర్వాత, వెహికిల్ ఆటోమేకర్ నెక్సాన్-బేస్డ్ ఎలక్ట్రిక్ ఎస్‍యువిని ప్రధాన డిజైన్ ఓవర్‌హాల్స్, అప్‌గ్రేడ్ చేసిన స్పెసిఫికేషన్స్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ తో అప్‌డేట్ చేసింది. ఇప్పుడు, అదేకార్‌మేకర్ రాబోయే మరో ఎలక్ట్రిక్ ఎస్‍యువిపంచ్ ఈవీని ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించింది.
పిక్చర్స్ లో చూసినట్లుగా, పంచ్ ఈవీ స్పోర్ట్స్ టెస్ట్ మ్యూల్ కొత్త బంపర్ మరియు వర్టికల్ స్లాట్స్ తో కూడిన గ్రిల్‌ను కలిగి ఉంది, డీఆర్ఎల్స్ బానెట్ లైన్‌కి కింద ఉంచబడ్డాయి మరియు మేము బానెట్ విడ్త్ లో ఎక్స్‌టెండెడ్ లైట్ బార్‌ను కూడా కలిగి ఉండవచ్చని మేము అనుకుంటున్నాము. అలాగే, సబ్-ఫోర్ మీటర్ ఈవీ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ సెటప్‌ను ఐసీఈ వెర్షన్‌లో కూడా కొనసాగించనుంది.
మరొక స్పై పిక్చర్ ని చూస్తే ఇందులో ఆటో-డిమ్మింగ్ ఐఆర్ విఎంతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉందని తెలుస్తుంది. ఫీచర్స్ విషయానికొస్తే, పంచ్ ఈవీ ఫీచర్స్నెక్సాన్ ఈవీనుండి తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ బేస్డ్ హెచ్‍విఎసికంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జర్, కొత్త గేర్ సెలెక్టర్ లీవర్ కోసం రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ట్విన్-స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ పరంగా, టాటా పంచ్ ఈవీ టియాగో మరియు టిగోర్ ఈవీల లాగ ఒకేలా అనిపించినా మెరుగైన ఎఫిషియన్సీ, రేంజ్, థర్మల్స్ మరియు పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. టాటా పంచ్ ఈవీ మార్కెట్లోకి వస్తే, టియాగో ఈవీ మరియు నెక్సాన్ ఈవీ మధ్య సరిగ్గా సరిపోతుంది. ఇండియాలో ఎలక్ట్రిక్ మైక్రో- ఎస్‍యువి సెగ్మెంట్‌లో టాటా పంచ్ ఈవీ సిట్రోయెన్ eC3కి పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్