- మెరుగైన మాన్యువల్ వేరియంట్స్ ఎఫిషియన్సీ
- రూ.25,000లతో బుకింగ్స్ ప్రారంభం .
టాటా మోటార్స్ ఇటీవలే ఫ్లాగ్షిప్ ఎస్యూవీ డ్యూయో, హారియర్ మరియు సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ల బుకింగ్స్ ప్రారంభించింది. లాంచ్‌కు ముందే టాటా- అధికారిక డీలర్షిప్ వద్ద కస్టమర్లు రూ.25,000 టోకెన్ అమౌంట్ తో ఎస్‌యూవీల కోసం తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆటోమేకర్ అప్డేటెడ్ హారియర్ ఇంప్రూవ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వివరాలను కూడా వెల్లడించింది.
న్యూ టాటా హారియర్ బిఎస్6 ఫేజ్ 2.0-కంప్లైంట్ అయిన 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ నుండి పవర్ ని పొందుతుంది. ఈ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడింది. 168bhp మరియు 350Nm టార్క్ తో పవర్ అవుట్‌పుట్ అలాగే ఉన్నప్పటికీ, ఈ అప్ డేట్ లోఎస్యూవీ మైలేజ్‌ను మాత్రం పెంచింది.
గతంలో, హారియర్ ఎస్యూవీ యొక్క మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్స్ లో 16.35kmpl మరియు 14.6kmpl ఫ్యూయల్ ఎఫిషియన్సీ అందించాయి. అదే విధంగా, హారియర్ అప్డేటెడ్ వెర్షన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లు కూడా 16.8kmpl మరియు 14.6kmpl ఫ్యూయల్ ఎఫిషియన్సీ అందించనున్నాయి.
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ మరికొన్ని వారాల్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఎస్యూవీ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ వాడుకలోకి వచ్చిన తర్వాత ఎంజి హెక్టర్ , మహీంద్రా ఎక్స్ యూవీ700, జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఎంజి ఆస్టర్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్ వ్యాగన్ టైగున్ లతో మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో పోటీ పడనుంది.
అనువాదించిన వారు:రాజపుష్ప