- అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్
- రూ. 11 లక్షలతో ధరలు ప్రారంభం
హ్యుందాయ్ ఇండియా ఫిబ్రవరి 2024లో తన వివిధ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ లిస్ట్ లో, ప్రస్తుతం ఈ నెల వెర్నా సెడాన్ ఆఫర్లో రూ.35, వేల వరకు డిస్కౌంట్లో ఉండగా, దీనిని నాలుగు వేరియంట్లలో రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
ఈ నెలలో హ్యుందాయ్ వెర్నాను బుక్ చేయాలనుకుంటున్న కస్టమర్లు బుక్ చేసుకున్న తర్వాత రూ. 15,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ పొందవచ్చు. అలాగే, ఎక్స్ఛేంజ్ బోనస్స్ రూ. 20,000 వరకు పొందవచ్చు. వేరియంట్, డీలర్షిప్ మరియు స్టాక్ లభ్యత మరియు ఇతర వివిధ కారణాలపై ఆధారపడి ఈ ఆఫర్లు మారవచ్చు.
హ్యుందాయ్ వెర్నా EX, S, SX మరియు SX (O) అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మెకానికల్ గా చూస్తే, ఇది 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్తో వచ్చింది. మొదటిది 113bhp మరియు 144Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది, రెండోది 158bhp మరియు 253Nm మాక్సిమం టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో ట్రాన్స్మిషన్ విధులు ఆరు-స్పీడ్ మాన్యువల్, ఆరు-స్పీడ్ ఆటోమేటిక్, ఏడు-స్పీడ్ డిసిటి మరియు సివిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప