- మరికొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం
- క్రెటా ఫేస్లిఫ్ట్ ఆధారంగా వస్తున్న క్రెటా ఈవీ మోడల్
కొత్త హ్యుందాయ్ క్రెటాని ప్రస్తుతం స్టాండర్డ్ మరియు N లైన్ వెర్షన్ అనే రెండు రకాలలో పొందవచ్చు. ఇప్పుడు, ఆటోమేకర్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ క్రెటా తాజాగా కొరియాలో ఛార్జింగ్ స్టేషన్ వద్ద ఛార్జ్ చేస్తుండగా కనిపించింది.
ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నట్లుగా, స్టాండర్డ్ వెర్షన్ తో పోలిస్తే క్రెటా ఈవీలో చిన్న చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో అతి పెద్ద తేడా ఏంటి అంటే, కొత్త ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ సెట్ మరియు ఫ్రంట్ బంపర్-మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్ ఉండనున్నాయి. అంతే కాకుండా, ఎలక్ట్రిక్ క్రెటా బ్లాంక్డ్ గ్రిల్ పై చిన్న లెటర్స్ తో ‘EV’బ్యాడ్జింగ్, కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, మరియు ఫ్లోర్-మౌంటెడ్ బ్యాటరీ ప్యాక్ కారణంగా తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ని పొందనుంది.
ఇప్పుడు, క్రెటా ఈవీకి సంబంధించిన డైమెన్షన్లు మరియు స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కూడా ఆటోమేకర్ వెల్లడించలేదు. అలాగే క్రెటా ఈవీ “ఫ్రంక్” అనే ఫ్రంట్ స్టోరేజ్ స్పేస్ తో వస్తుందని మేము భావిస్తున్నాము.
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, క్రెటా ఈవీ దాని ఐసీఈ మోడల్ లాగే ఫీచర్-రిచ్ మోడల్ గా కొనసాగనుంది. అలాగే ఇది ట్విన్-డిస్ ప్లే సెటప్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, కొత్త సీట్ అప్హోల్స్టరీ, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, పనోరమిక్ సన్ రూఫ్, మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో రానుంది.
స్పెసిఫికేషన్ల పరంగా, మార్కెట్లో దీనిపై ఉన్న అంచనాలను బట్టి, క్రెటా ఈవీ సింగిల్ ఛార్జ్ లో500కిలోమీటర్ల రేంజ్ ని అందించే55-60kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని అంచనా వేస్తున్నాము. ఇక పోటీ విషయానికి వస్తే, హ్యుందాయ్ క్రెటా ఈవీ కారు టాటా హారియర్, ఎంజి ZS ఈవీ, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, మహీంద్రా XUV400, మరియు టాటా కర్వ్ ఈవీతో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్