- ఇండియాలో రూ.6 లక్షలతో ప్రారంభంకానున్న పంచ్ ధరలు
- తాజాగా 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన పంచ్
మేము ఇటీవల జనవరి 2024లో టాటా మోటార్స్ కి సంబంధించి అన్ని కార్ల వెయిటింగ్ పీరియడ్‌ని పొందాము. ఈ ఆర్టికల్ లో, ఈ బ్రాండ్ యెక్క బి-ఎస్యువి, పంచ్ టైమ్‌లైన్‌ను ఒకసారి పరిశీలిద్దాం. ఈ మోడల్ హ్యుందాయ్ ఎక్స్టర్ మరియు సిట్రోన్ C3 వంటి వాటికి పోటీగా ఉంది.
జనవరి నాటికి, టాటా పంచ్ ని బుక్ చేసుకునే కస్టమర్స్ బుక్ చేసుకున్న తేదీ నుండి కేవలం 4 వారాల వరకు మాత్రమే వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ టైమ్‌లైన్, ముంబై ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందని మీరు గమనించాల్సి ఉంది, ఈ లైనప్లోనిఎన్నుకున్న అన్ని వేరియంట్స్ మరియు కలర్స్ చెల్లుబాటులో ఉన్నాయి. నవంబర్ 2023లో పంచ్‌పై 12 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ చాలా వారకు తగ్గింది. ఓ రకంగా కస్టమర్లకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
ఈ టాటా పంచ్ ఇటీవల ఇండియాలో 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. కార్‌మేకర్ ఈ మోడల్‌ను అక్టోబర్ 2021లో తిరిగి పరిచయం చేయగా, కస్టమర్లు దీనిని రూ. 5.49 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) పొందవచ్చు. బి-ఎస్యువి వెర్షన్ప్రస్తుతం రెండు పవర్‌ట్రెయిన్స్, 7 కలర్స్ మరియు 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప