- కొత్త వేరియంట్లో మరిన్ని ఫీచర్ అప్డేట్లతో అందుబాటులో ఉన్న XUV700.
- ఇంజన్లో ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన AX5 సెలెక్ట్ వేరియంట్
మహీంద్రా కంపెనీ నేడే దేశవ్యాప్తంగా XUV700 రేంజ్ లోకి AX5 సెలెక్ట్ (AX5 S) అనే మరొక కొత్త వేరియంట్‌ని తీసుకువచ్చింది. ఈ కొత్త వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.16.89 లక్షలు. కస్టమర్లకు చవక ధరలో ప్రీమియం ఫీచర్లను మరియు లగ్జరీ ఎక్స్పీరియన్స్ అందించడమే ఈ కొత్త వేరియంట్‌ను పరిచయం చేయడానికి కారణం అని తెలుస్తుంది.
XUV700 AX5 సెలెక్ట్ వేరియంట్లో ఫుల్-సైజ్ వీల్ కవర్లు, ఎల్ఈడీ టెయిల్లైట్లు, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్విఎం వంటివి కొత్తగా చేర్చబడ్డాయి. అంతే కాకుండా, ఈ వేరియంట్ 7-సీటర్ లేఅవుట్లో కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త వేరియంట్లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ హెచ్డి 10.25-ఇంచ్ స్క్రీన్, అడ్రినాక్స్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్లెస్ మొబైల్ కనెక్టివిటీ, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఐసోఫిక్స్ మౌంట్స్, స్టోరేజ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ మరియు మూడవ వరుసలో ఏసీ వెంట్స్ వంటి అనేక ఫీచర్లు ఇందులో అందుబాటులోకి వచ్చాయి.
మహీంద్రా ఇటీవలే 7-సీటర్ MX వేరియంట్ మరియు AX7L వేరియంట్ లో లిమిటెడ్ ఎడిషన్ గా పిలువబడుతున్న బ్లేజ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది, ఇందులో బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్ మరియు రెడ్ యాక్సెంట్లతో కూడిన ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్ ఉన్నాయి, ఇవి కారుకు ప్రత్యేకమైన లుక్ ని అందిస్తుంది.
XUV700 వేరియంట్ వారీగా అప్డేటెడ్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | సీటింగ్ కెపాసిటీ | ఎక్స్-షోరూం ప్రారంభ ధర | |
పెట్రోల్ (ఎంటి) | డీజిల్ (ఎంటి) | ||
MX | 5-సీటర్ | రూ.13.99 లక్షలు | రూ.14.59 లక్షలు |
7-సీటర్ | రూ.14.49 లక్షలు | రూ.14.99 లక్షలు | |
AX3 | 5- సీటర్ | రూ. 16.39 లక్షలు | రూ.16.99 లక్షలు |
AX5 సెలెక్ట్ (AX5 S) | 7-సీటర్ | రూ.16.89 లక్షలు | రూ.17.49 లక్షలు |
AX5 | 5- సీటర్ | రూ. 17.69 లక్షలు | రూ.18.29 లక్షలు |
7- సీటర్ | రూ. 18.19 లక్షలు | రూ.18.79 లక్షలు |
XUV700 AX5 సెలెక్ట్ వేరియంట్ 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్‌తో వచ్చింది, ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్లతో జతచేయబడ్డాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్