- ఇంజన్‌లో ఎలాంటి మార్పు లేకుండా వస్తున్న ఫేస్‌లిఫ్ట్ మోడల్
- మరిన్ని ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం
జీప్ ఇండియా ఇటీవల దాని మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసే ప్లాన్ ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆటోమేకర్ రాబోయే (అప్‍కమింగ్) కొత్త రాంగ్లర్‌ను చాలా రోజుల నుంచి టీజ్ చేస్తూనే ఉంది, అయితే మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. ఈ మూడు-వరుసల ఎస్‍యూవీ రాంగ్లర్ లాంచ్ అయిన తర్వాత 2024 అప్‌డేట్‌ను పొందుతుందని ఇప్పుడు మేము తెలుసుకున్నాము, అంటే ఇది రాంగ్లర్ తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
జీప్ మెరిడియన్ మొదటిసారిగా 2022లో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఎప్పటికప్పుడు చిన్నపాటి అప్‌డేట్‌లు మరియు డిఫరెంట్ వెర్షన్‌లను ఈ మోడల్ అందుకుంటూనే ఉంది. ఇప్పుడు 2024 అప్‌డేట్ ద్వారా, కంపాస్-బేస్డ్ ఎస్‍యూవీ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లను జత చేసి కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లతో వస్తుందని మేము భావిస్తున్నాము.
మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ రీడిజైన్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, అప్‌డేటెడ్ గ్రిల్, రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్‌లతో రావచ్చని భావిస్తున్నాం. ఈ ఎస్‍యూవీ పొడవు మరియు వెడల్పులో ఎటువంటి మార్పు లేకుండా అవే కొలతలతో రానుందని మీకు తెలియజేస్తున్నాం.
మెరిడియన్ ప్రస్తుత మోడల్‌లో 10.1-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ మరియు పవర్డ్ సీట్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఈ అప్‌డేట్ తర్వాత, ఎస్‍యూవీ కొత్త యూజర్ ఇంటర్ఫేస్ మరియు రియర్ విండో బ్లైండ్‌లతో పెద్ద 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్ సూట్)ని పొందుతుందని భావిస్తున్నాం.
కొత్త వెర్షన్లో వస్తున్న జీప్ మెరిడియన్ ఇంజన్ లేదా గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఎటువంటి మార్పులు లేవు. మెరిడియన్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ లాగే అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను ఇందులో కూడా కొనసాగిస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడుతుంది. అదనంగా, ఇది 4డబ్లూడీ కాన్ఫిగరేషన్‌ను పొందుతుంది, కానీఇది కేవలం ఆటోమేటిక్ వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్