- మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లో లభ్యం
- స్పోర్ట్జ్ మరియు ఆస్టా వేరియంట్ల మధ్య సరిగ్గా పొజిషన్ చేయబడిన స్పోర్ట్జ్ (O)
i20 హ్యచ్ బ్యాక్ యొక్క కొత్త స్పోర్ట్జ్ (O) ధరలను హ్యుందాయ్ ఇండియా వెల్లడించింది. కొత్తగా వచ్చిన ఈ ఆప్షనల్ వేరియంట్ స్పోర్ట్జ్ వేరియంట్ ఆధారంగా మరియు రూ. 8.73 లక్షలు (ఎక్స్-షోరూం) తో లాంచ్ అయింది. దీనిని సింగిల్ మరియు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో మాన్యువల్ గేర్ బాక్సుతో పొందవచ్చు. ఇంతకు ముందున్న దాని ధర రూ. 8.73 లక్షలు (ఎక్స్-షోరూం) గా ఉంది.
స్పోర్ట్జ్ వేరియంట్ తో పోలిస్తే కొత్త స్పోర్ట్జ్ (O) వేరియంట్ ధర రూ. 35,000 ఎక్కువగా ఉంది. అదనపు ఖర్చుతో దీనిని వైర్ లెస్ ఛార్జర్, డోర్ ఆర్మ్ రెస్ట్ పై లెదరెట్ ఫినిష్, మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్ వంటి 3 ఫీచర్లతో పొందవచ్చు.
హుడ్ కింద, హ్యుందాయ్i20 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఐవిటి యూనిట్ తో జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 82bhp మరియు 115Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్పోర్ట్జ్ (O) వేరియంట్ తో మాత్రమే కాకుండా, దీనిని రూ. 7.04 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి రూ. 11.21 లక్షలు (ఎక్స్-షోరూం) ధరతో ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా, మరియు ఆస్టా (O) అనే మిగతా 5 వేరియంట్లలో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్