మహీంద్రా XUV 3XOని లాంచ్ చేయడం ద్వారా ఇండియన్ సబ్-ఫోర్ ఎస్‍యూవీ మార్కెట్ ని షేక్ చేస్తుంది. ఈ మోడల్ ఇంతకు ముందు వచ్చిన మోడల్ కంటే మెరుగైన ఫీచర్లతో రాగా, దానికి పోటీగా ఉన్న వాటితో పోలిస్తే ధర కూడా రూ. 50,000 తక్కువగా ఉంది. ఇప్పుడు, దీనిని ఎదుర్కోవడానికి మరియు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి టాటా మోటార్స్ నెక్సాన్ లో స్మార్ట్ (O) అనే కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఆర్టికల్ లో, మనం ఈ రెండు ఎస్‍యూవీల ఎంట్రీ-లెవెల్ వేరియంట్లను పోల్చి చూస్తూ ఇందులో ఏ వేరియంట్ బెస్ట్ గా ఉందో తెలుసుకుందాం.
ధరలు
ఇప్పుడు, మహీంద్రా XUV 3XOని MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5 L, AX7, మరియు AX7 L అనే తొమ్మిది వేరియంట్లలో పొందవచ్చు. ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడు మనం MX1 వేరియంట్ పై ఫోకస్ చేద్దాం. మహీంద్రా XUV 3XO యొక్క MX1 వేరియంట్ రూ.7.49 లక్షలు ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది.
అదే విధంగా, టాటా నెక్సాన్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, మరియు ఫియర్ లెస్ అనే నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. కొత్త వేరియంట్ల విషయానికి వస్తే, నెక్సాన్ స్మార్ట్ (O), స్మార్ట్+, స్మార్ట్+ S అనే వేరియంట్లను కలిగి ఉంది. అలాగే, మొదటి స్మార్ట్ (O) పెట్రోల్-పవర్డ్ వెర్షన్ కాగా, మిగతా రెండు వేరియంట్లు డీజిల్ ఇంజిన్ తో వచ్చాయి. ఇక ధర విషయానికి వస్తే, నెక్సాన్ కొత్త బేస్-స్పెక్ పెట్రోల్ వేరియంట్ రూ.7.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
పోల్చి చూస్తే, XUV 3XOMX1 వేరియంట్ ధర నెక్సాన్ స్మార్ట్ (O) కంటే రూ. 50,000 మరింత తక్కువగా ఉంది.
ఫీచర్లు
మహీంద్రా XUV 3XO MX1 |
హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఓఆర్‍విఎంలపై ఎల్ఈడీ ఇండికేటర్స్ ఎల్ఈడీటెయిల్‌ల్యాంప్‌లు 6 ఎయిర్‌బ్యాగ్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‍సీ) ఐఫోఫిక్స్మౌంట్స్ 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‍విఎం ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్టీరింగ్ మోడ్స్ ఆల్-ఫోర్ పవర్ విండోస్ ఒక టచ్ అప్/డౌన్ - డ్రైవర్ విండో స్టోరేజ్ తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ రియర్ ఏసీవెంట్స్ యూఎస్‍బీఛార్జింగ్ పోర్ట్స్ (టైప్-ఎమరియు టైప్-సి) 12V సాకెట్ వెనుక వరుసలో అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ప్యాసింజర్లు అందరికీ సీట్‌బెల్ట్ రిమైండర్ ఫ్రంట్ హైట్ అడ్జస్టబుల్ సీటు బెల్ట్స్ త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్స్ |
టాటా నెక్సాన్ స్మార్ట్ (O) |
6 ఎయిర్‌బ్యాగ్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‍సీ) ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ ఇల్యూమినేటెడ్ లోగోతో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ ఫ్రంట్ పవర్ విండోస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఐఫోఫిక్స్మౌంట్స్ డ్రైవ్ మోడ్స్ |
పవర్ ట్రెయిన్
బానెట్ కింద, మహీంద్రా XUV 3XO మరియు టాటా నెక్సాన్ అనే ఈ రెండూ మోడల్స్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో వచ్చాయి. ఇందులో ఒకటైన నెక్సాన్ 3-సిలిండర్ రెవోట్రాన్ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి 118bhp మరియు 170Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది.
మరోవైపు, XUV 3XO ఎంస్టాలియన్ గ్యాసోలిన్ మోటార్ 109bhp మరియు 200Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే, నెక్సాన్ లాగా కాకుండా, XUV 3XO, 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్