- మరోసారి నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న మారుతి
- కేవలం 2,000 యూనిట్లతో వెనుకబడిన టాటా
గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ బాగా పెరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, హ్యుందాయ్ మరియు టాటా బ్రాండ్ల మధ్య గట్టి పోటీ ఉంది, అయితే చివరికి హ్యుందాయ్ కొన్ని ఎక్కువ యూనిట్లను విక్రయించడం ద్వారా టాటాపై పైచేయి సాధించింది.
మొదటి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్న కియా మరియు మహీంద్రా
ఏప్రిల్-2024లో టాటా 47,883 యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ 2,000 యూనిట్లు ఎక్కువగా విక్రయించడంతో సేల్స్ 50,201 యూనిట్ల వరకు జోరందుకున్నాయి. దీంతో హ్యుందాయ్ బ్రాండ్ టాప్ పొజిషన్ ని కొట్టేసింది. ఈ జాబితాలో మారుతి సుజుకి టాప్ పొజిషన్లో నిలవడం గమనార్హం. మారుతి మొత్తం సేల్స్ టాటా మరియు హ్యుందాయ్ బ్రాండ్ల సేల్స్ నంబర్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. మారుతి సుజుకి ఏప్రిల్ 2024లో ఊహించని రీతిలో 1,37,952 యూనిట్లను విక్రయించింది. మహీంద్రా 41,008 యూనిట్లను విక్రయించి నాలుగో స్థానంలో నిలిచింది. కియా 19,968 యూనిట్లతో టాప్-5లో చోటు దక్కించుకుంది. వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే, గతేడాది ఏప్రిల్ నుంచి కియా విక్రయాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇతర బ్రాండ్లు సంవత్సరానికి నెలవారీ సేల్స్ పరంగా గణనీయమైన వృద్ధిని సాధించాయి. గతేడాది ఈ కాలంలో కియా 23,216 యూనిట్లను విక్రయించగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కియా కంపెనీ 19,968 యూనిట్లను మాత్రమే విక్రయించింది.
టయోటా ఏప్రిల్-2023లో 14,162 యూనిట్లను విక్రయించగా, ఈ సంవత్సరం బ్రాండ్ 18,700 యూనిట్ల విక్రయాలను సాధించింది. మరోవైపు, హోండా మరియు ఎంజి సేల్స్ దాదాపు నాలుగున్నర వేల యూనిట్లకు పడిపోయాయి.
భారీగా పెరిగిన మహీంద్రా సేల్స్
హ్యుందాయ్ సేల్స్ 1 శాతం పెరగగా, టాటా సేల్స్ ఏడాది ప్రాతిపదికన చూస్తే, 1.86% వృద్ధిని రిజిస్టర్ చేశాయి. బెస్ట్ సెల్లింగ్ వెహికల్ బ్రాండ్ల జాబితాలో మహీంద్రా నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ, ఇతర బ్రాండ్లతో పోలిస్తే దాని అమ్మకాలు అత్యధికంగా పెరిగాయి. మహీంద్రా వార్షిక అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 18% పెరిగాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్