- త్వరలో లాంచ్ కానున్న అల్ట్రోజ్ యొక్క స్పోర్టియర్ ఇటరేషన్
- 118bhp- ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ పవర్డ్ ఇంజిన్‌తో లభ్యం
టాటా మోటార్స్ భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2024లో వివిధ రకాల ఆసక్తికరమైన ప్రొడక్ట్స్ లను ప్రదర్శించడానికి అవకాశాన్ని దక్కించుకుంది. వీటిలో హారియర్ ఈవీ, నెక్సాన్ డార్క్, నెక్సాన్ సిఎన్‍జి మరియు కర్వ్ ఐసీఈ తోసహా మరికొన్ని మోడళ్లలో ఆల్ట్రోజ్ రేసర్ కూడా ఉంది.వీటిలో రెండోది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పో లోఆరగ్రేటం చేసింది.
ప్రాముఖ్యంగా టాటా ఆల్ట్రోజ్ రేసర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ వెర్షన్ మరియు దాని రెగ్యులర్ వెర్షన్ తో పోలిస్తే వేరు వేరుగా లోపల అనేక అప్‌డేట్‌లను పొందుతుంది. ఈ మోడల్ 1.2-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ మోటార్ ద్వారా 118bhp మరియు 170Nm పవర్ ని ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.
బయటి వైపు, ఆల్ట్రోజ్ రేసర్ డ్యూయల్-టోన్ పెయింట్ థీమ్, కారు మధ్యలో ట్విన్ వైట్ స్ట్రిప్స్, 'రేసర్' బ్యాడ్జింగ్, న్యూ 16-ఇంచ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్-అవుట్ హుడ్‌ను పొందుతుంది.
ఈ మోడల్ లోపలి వైపు, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, కాంట్రాస్ట్ ఆరెంజ్ స్టిచింగ్ మరియు సీట్స్ కోసం ఇన్‌సర్ట్‌లు, హెడ్‌రెస్ట్‌లపై 'రేసర్' ఎంబాసింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వెనుక ఏసీ వెంట్స్ , వైర్‌లెస్ ఛార్జర్, హెచ్ యూడీమరియు 7-ఇంచ్ డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లను పొందుతుంది.