- రూ.75,000 వేల క్యాష్ డిస్కౌంట్
- అక్టోబర్ 17న లాంచ్ అయిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్స్
అప్ డేటెడ్ హారియర్ తో పాటుగా సఫారి ఫేస్‌లిఫ్ట్ ను టాటా మోటార్స్ అక్టోబర్ 17న లాంచ్ చేసింది. ఈ రెండు ఎస్‌యూవీలు కొత్త వేరియంట్ పేర్లతో రివైజ్డ్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా బెనిఫిట్ ను పొందాయి. అంతే కాకుండా ఈ రెండు ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్స్ నవంబర్ నెలలో భారీ డిస్కౌంట్స్ తో అమ్మకాలను కొనసాగిస్తున్నాయి.
కస్టమర్స్ ఎవరైతే ప్రీ- ఫేస్‌లిఫ్టెడ్ టాటా సఫారి మరియు హారియర్ ని ఎంచుకుంటున్నారో వారు రూ.1.40 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. అందులో రూ.75,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్, రూ.50,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.15,000 వరకు కార్పోరేట్ ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, దేశవ్యాప్తంగా ఉన్న డీలర్స్ పాత వెర్షన్స్ స్టాక్ ని అంతా క్లియర్ చేస్తూనే, వీటిపై డీలర్-ఎండ్ నుంచి భారీగా బెనిఫిట్స్ ని కూడా అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న డీలర్ ని సంప్రదించగలరు.
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్స్ చాలా కొత్త ఫీచర్స్ పొంది మరియు వీటి డిజైన్ మరింత మెరుగుపడగా, మెకానికల్ గా ఈ మోడల్స్ లో పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. ఇంతకు ముందు లాగే దీని 2.0-లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జత చేయబడింది. ఈ బిఎస్6 2.0-కంప్లైంట్ ఇంజిన్ 168bhp మరియు 350Nm పీక్ టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్