- గెజా ఎడిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పరిచయం చేయబడిన గెజా స్పెషల్ ఎడిషన్
- అందుబాటులోకి వచ్చిన టర్బో-పెట్రోల్ సివిటి టైప్
నిసాన్ మోటార్ ఇండియా మాగ్నైట్ ఎస్‌యూవీలో గెజా స్పెషల్ ఎడిషన్ ని తీసుకురావడం ద్వారా గెజా ఎడిషన్ మొదటి వార్షికోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఈ కొత్త ఎడిషన్ టర్బో-పెట్రోల్ సివిటి టైప్ లో రూ.9.84 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో అందుబాటులోకి వచ్చింది.
ఫీచర్స్ పరంగా చెప్పాలంటే, మాగ్నైట్ కొత్త ఎడిషన్ 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, జెబిఎల్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, గైడ్ లైన్లతో రియర్ కెమెరా మరియు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు ఈ మోడల్ ని బీజ్-కలర్డ్ సీట్ అప్హోల్స్టరీతో కూడా పొందవచ్చు.
మెకానికల్ గా, దీని పేరు చెప్పిన విధంగా మాగ్నైట్ గెజా స్పెషల్ సివిటి ఎడిషన్ మోడల్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ సివిటి గేర్ బాక్సుతో జతచేయబడింది. ఈ కండీషన్లో ఇంజిన్ 99bhp మరియు 152Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది.
లాంచ్‌పై నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స స్పందిస్తూ 'గతేడాది గెజా స్పెషల్ ఎడిషన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దాని తర్వాత మాగ్నైట్ నుంచి ఇప్పుడు సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ప్రీమియం ఫీచర్లను అందించడానికి మార్కెట్లోని కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కీలకమైన సమాచారాన్ని సేకరించాము. మాగ్నైట్ గెజా సివిటి స్పెషల్ ఎడిషన్ మార్కెట్లో ఏ ఇతర ప్రోడక్టు కూడా ఆఫర్ చేయని ఫీచర్లతో మరియు అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ ఫీచర్లు, మరియు చవకైన ధరలో సివిటిటర్బోని అందుబాటులోకి తీసుకువచ్చాం.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్