- ఇండియాలో రూ.16.82 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ధరలు ప్రారంభం
- త్వరలో ప్రారంభంకానున్న క్రెటా N లైన్ డెలివరీ
హ్యుందాయ్ మోటార్ తాజాగా హ్యుందాయ్ క్రెటా N లైన్ కారును దేశవ్యాప్తంగా లాంచ్ చేయగా, దీని ధరలు రూ.16.82 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఎస్యూవీ యొక్క స్పోర్టీ ఇటరేషన్ రెండు వేరియంట్లలో సింగిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇప్పుడు, కియా సెల్టోస్ తో పోటీగా ఉన్న ఈ మోడల్ ఇండియా అంతటా ఉన్న డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
మిగతా N లైన్ కారు మోడల్స్ లాగానే, క్రెటా N లైన్ కొత్త ఫ్రంట్ గ్రిల్, రెడ్ ఇన్సర్ట్స్ తో కూడిన ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, మోడల్ అంతటా ‘N-Line’ బ్యాడ్జింగ్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, రెడ్ కలర్డ్ సైడ్ స్కర్ట్స్, మరియు 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ పొందింది. ఇంటీరియర్ పరంగా లోపల, క్యాబిన్ కూడా ఎక్స్టీరియర్ కలర్ లో వస్తుండగా, రెడ్ యాక్సెంట్స్ మరియు రెడ్ యాంబియంట్ లైటింగ్ తో ఆల్-బ్లాక్ థీమ్ ని కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇది బ్లాక్ లెదరెట్ సీట్లలో హెడ్ రెస్ట్స్ పై ‘N-Line’ బ్యాడ్జింగ్ మరియు రెడ్ స్టిచింగ్ ద్వారా లెదర్ తో చుట్టబడిన గేర్ లీవర్ వంటి వాటిని పొందింది.
క్రెటా N లైన్ కారులో అతి ముఖ్యమైన భాగమైన ఇంజిన్ గురించి చెప్పాలంటే, ఇది 158bhp మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. ఇందులోని ఇంజిన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పవర్ ఫ్రంట్ వీల్స్ కి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్ ద్వారా పంపించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్