- నాలుగు ఎక్స్టీరియర్ పెయింట్ కలర్లను పొందిన బోల్డ్ ఎడిషన్
- పరిమిత సంఖ్యలో లభించనున్న ఆడిQ7 బోల్డ్ ఎడిషన్
ఈ నెల ప్రారంభంలో ఆడి ఇండియా Q3 బోల్డ్ ఎడిషన్ ని దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ అదే Q7ఎస్యూవీని రూ. 97.84 లక్షల ఎక్స్ షోరూం ధరతో ఇండియాకి పరిచయం చేసింది. ఈ Q7లిమిటెడ్-రన్ స్పెషల్ ఎడిషన్ గ్లేసియర్ వైట్, మైతోస్ బ్లాక్, నవర్రా బ్లూ, సమురాయ్ గ్రే అనే నాలుగు ఎక్స్టీరియర్ పెయింట్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది.
ఈ బోల్డ్ ఎడిషన్ ద్వారా, Q7 బ్లాక్ స్టైలింగ్ తో స్పోర్టీ ఎక్స్టీరియర్ డిజైన్ ని పొందింది. ఇంకా ఇందులోని డిజైన్ హైలైట్లలో గ్లోసీ బ్లాక్ గ్రిల్, కారు ముందు మరియు వెనుక భాగంలో బ్లాక్డ్-అవుట్ ఆడి లోగో, మరియు బ్లాక్డ్-అవుట్ విండో సరౌండ్స్, ఓఆర్విఎం, మరియు రూఫ్ రెయిల్స్ ఉన్నాయి.
మెకానికల్ గా, Q7బోల్డ్ ఎడిషన్ 3.0-లీటర్ V6 ఇంజిన్ 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్ తో జతచేయబడి వచ్చింది. ఈ మోటార్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరియు ఏడబ్లూడీ సిస్టంతో జత చేయబడి 335bhp మరియు 500Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, ఈ ఎస్యూవీ కేవలం 5.6 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళడమే కాకుండా గంటకు 250 కిలోమీటర్ల దూరాన్ని ఈజీగా చేరుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా కార్ వాలే వెబ్ సైట్ ద్వారా తెలుసుకుని ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ మోడల్ లిమిటెడ్ ఎడిషన్ అన్న సంగతి మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్