- సోనెట్ ఫేస్‌లిఫ్ట్ లో లభించనున్న సింగిల్-పేన్ సన్‌రూఫ్
- 3 ఇంజిన్ ఆప్షన్స్ తో వచ్చే అవకాశం
కియా ఇండియా ఈ సంవత్సరం డిసెంబర్‌లో అప్ డేటెడ్ సోనెట్ లాంచ్ కానుండగా దానికంటే ముందే కియా ఇండియా అప్‌డేటెడ్ సోనెట్‌ను పరీక్షిస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త స్పై పిక్చర్ లలో అరోరా బ్లాక్ పెర్ల్ షేడ్‌లో వస్తున్నట్లు పూర్తిగా కాకుండా కొద్దిగా కామోఫ్లేజ్ టెస్ట్ మ్యూల్ తో కప్పి ఉన్న యూనిట్‌ని చూస్తే మనకు అర్థం అవుతుంది.
2024కియా సోనెట్ లో, ఇక్కడ పిక్చర్స్ ని చూసినట్లుగా, గత నెలలో లీక్ అయిన గ్లోబల్-స్పెక్ మోడల్ మాదిరిగానే అప్‌డేటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల సెటప్‌ను పొందింది.ఇందులో ఉన్న మరిన్ని ముఖ్యాంశాలలో కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ రూఫ్- రెయిల్స్, కొత్త ఎల్ఈడీ టైల్‌లైట్లు మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉన్నాయి. ఈ మోడల్ న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌ల సెట్‌తో స్పోర్ట్ లుక్ ని కలిగి ఉండి టెయిల్‌గేట్‌పై ఎల్ఈడీ లైట్ బార్ అమర్చబడి ఉంటుంది.
సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ఉన్న మార్పులను గమనిస్తే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ ఫంక్షన్‌ల కోసం టచ్-బేస్డ్ కంట్రోల్స్, అప్‌డేట్ చేయబడిన ఇంటీరియర్ థీమ్ మరియు అప్హోల్స్టరీను కలిగి ఉంది. రెండవ-వరుసలో విండోస్ కోసం సన్-బ్లైండ్స్ మరియు ఏడీఏఎస్ సూట్ తో వచ్చే అవకాశం ఉంది.
ఫేస్‌లిఫ్టెడ్ కియా సోనెట్ అవుట్‌గోయింగ్ వెర్షన్ వలె ఒకే విధమైన రేంజ్ ఇంజిన్‌లతో అందించబడుతుందని భావిస్తున్నాం. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్, 1.5-లీటర్ డీజిల్ మిల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి.ఇది లాంచ్ అయితే, న్యూ సోనెట్ మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి300 లకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప