- రూ.3.99 లక్షలతో ఆల్టో K10ధరలు ప్రారంభం
- 4 వేరియంట్లలో లభ్యం
మారుతి సుజుకి తన మోడల్ రేంజ్ లో ఉన్న అన్నింటి ధరలలో మార్పులు చేసింది, పెరిగిన ధరలు ఇప్పటినుంచే అమలులోకి రానున్నాయి. ఎంచుకున్న కారు మరియు వేరియంట్ ని బట్టి ధరలలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఆల్టో K10 ధరల మార్పును ఒకసారి పరిశీలిద్దాం.
ఆల్టో K10 రేంజ్ లో ఉన్న VXi AGS మరియు VXi+ AGS వేరియంట్లపై ఒక్కోదానిపై రూ.5,000 తగ్గించబడింది. దీంతో, ఈ వేరియంట్ల ధర వరుసగా రూ. 5.56 లక్షలు మరియు రూ. 5.85 లక్షలుగా (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) ఉంది.
ఇక మారుతి ఆల్టో K10 యొక్క ఇతర వేరియంట్ల విషయానికి వస్తే, వీటి ధరలలో ఎలాంటి మార్పు లేదు, వీటి ధర రూ.3.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 5.96 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) వరకు ఉంది. ఈ హ్యచ్‍బ్యాక్ ప్రస్తుతం Std, LXi, VXi, and VXi+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్