- 1.70 లక్షల టాటా కార్లకు బైకులపై సర్వీసింగ్
- టాటా నుండి ఇలాంటి సేవలను పొందేందుకు ఇష్టపడుతున్న 68% టాటా కస్టమర్స్
కొన్నేళ్ళ నుంచి టాటా మోటార్స్ వాహనాల అమ్మకాల గ్రాఫ్ నిరంతర ప్రక్రియగా పైపైకి వెళ్తోంది. ఇటువంటి తరుణంలో, సంస్థ యొక్క ఎక్కువ వాహనాలు రోడ్లపై నడుస్తాయి, అలాంటప్పుడుఎక్కువ వాహనాలు వారి వర్క్‌షాప్‌లకు సర్వీస్‌కు చేరుకుంటాయి. ఈ భారతీయ కార్ల తయారీదారు తన సేవను మెరుగుపరచడానికి మరియు సాధ్యమైనంత తక్కువ సమయంలో తన కార్ సర్వీస్ సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, కస్టమర్ కేర్, డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్, డింపుల్ మెహతాతో మేము జరిపిన ప్రత్యేక సంభాషణలో, కంపెనీ ఇప్పుడు టాటా కార్లను బైక్‌ల సహాయంతో కూడా సర్వీసింగ్ చేస్తుందని మేము తెలుసుకున్నాము. ఈ సర్వీస్ కంపెనీకి చాలా లాభాలను చేకూర్చనుంది.
దీనిపై డింపుల్ మాట్లాడుతూ, 'మేము కస్టమర్ల సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము. ఇటీవల, మేము ఈజీ సర్వ్ ప్రోగ్రాంకింద డోర్‌స్టెప్ సర్వీస్ అందించే సౌకర్యాన్ని ప్రారంభించాము. దీనికి కస్టమర్ల నుండి మంచి స్పందన, ఆదరణ కారణంగా, మేము ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింతగా విస్తరించాలని భావిస్తున్నాము.' అని పేర్కొన్నారు.
ఈజీ సర్వ్ ప్రోగ్రాం ద్వారా అందుబాటులో ఉన్న డోర్‌స్టెప్ సర్వీసింగ్
ఈజీ సర్వ్ ప్రోగ్రాం ప్రచారంలో, ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 220 బైక్‌ల సహాయంతో 1.70 లక్షల కార్లకు సర్వీసును అందించింది. వాహనాన్ని సర్వీసింగ్ చేయడానికి, సాంకేతిక నిపుణుడు బైక్‌పై ప్రయాణించి, ప్రైమరీ సర్వీసింగ్ టూల్స్ ద్వారా కస్టమర్ ఇంటి వద్దకే లేదా నిర్దేశిత ప్రదేశానికి చేరుకుంటాడు. దీంతో కస్టమర్లు చిన్న పనికి కూడా సర్వీస్ సెంటరుకు రావాల్సిన అవసరం లేదు. ఇలాంటి సర్వీసునే కదా ఏ కస్టమర్ అయినా కోరుకునేది.
వర్క్‌షాప్‌లకు దూరంగా ఉన్న టైర్-2, టైర్-3 నగరాలలో ఈ ప్రోగ్రాం చాలా వరకు సహాయపడిందని, కోవిడ్‌కు ముందు కంపెనీ దేశవ్యాప్తంగా 570వర్క్‌షాప్‌లను కలిగి ఉండగా, ప్రస్తుతం ఇప్పుడు ఈ సంఖ్య 929 వర్క్‌షాప్‌లకు చేరుకుందని డింపుల్ తెలిపారు.
సేవా నెట్‌వర్క్‌ను విస్తరించడం మరియు మరిన్ని సేవలను అందించడం ద్వారా, టాటా కస్టమర్లను స్థిరంగా తమ వద్దే ఉండేలా చేయనుంది. అంటే బయటికి వెళ్లే బదులు కంపెనీ నుండి ఈ సేవలను పొందే రేటును పెంచనుంది. ఇంతకుముందు ఈ రేటు దాదాపు 42% ఉంది, ఇప్పుడు 68% వరకు చేరుకుంది. కస్టమర్లు తమ టాటా కారును టాటా సర్వీస్ సెంటర్ల నుండి మాత్రమే సర్వీస్‌ను పొందుతున్నారు.
సర్వీస్ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నం
అలాగే, డింపుల్ ప్రకారం, కంపెనీ మరింత ఎఫిషియన్సీ కోసం సర్వీస్ వ్యవధిని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తోంది. కారు ప్రైమరీ సర్వీస్ కోసం గరిష్టంగా 90 నుండి 120 నిమిషాల సమయం తీసుకోవడంపై కూడా కంపెనీ దృష్టి సారిస్తోంది. ఇలా చేస్తే, తక్కువ సర్వీస్ పీరియడ్ కారణంగాఒక రోజులో ఎక్కువ వాహనాలు సర్వీస్ చేయబడతాయి మరియు కస్టమర్లు సర్వీస్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు.
ప్రస్తుతం టాటా కంపెనీకి చెందిన మొత్తం 11 కార్లు ఇండియన్ ఆటో మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వెర్షన్స్ లో టాటా నెక్సాన్, టియాగో మరియు టిగోర్ అనే మరో మూడు మోడల్స్ కూడా ఉన్నాయి. ఐసీఈ మరియు ఎలక్ట్రిక్ లతో కలిపి టాటా కంపెనీ భవిష్యత్తులో మరో 9 కార్లను ఆటో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్