- అతి తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం
- కుషాక్ ఎలిగెన్స్ వేరియంట్ తో పాటుగా లాంచే అయ్యే ఛాన్స్
చివరి నెలలో, స్కోడా ఇండియా స్లావియా మ్యాట్ ఎడిషన్ ను ఇండియాలో రూ.15.52 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇప్పుడు, ఈ కార్ మేకర్ సెడాన్ యొక్క ఎలిగెన్స్ వేరియంట్ ను రూ. 17.52 లక్షలతో లాంచ్ చేసింది. ఈ మోడల్ కేవలం అతి తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వేరియంట్ లైనప్ పరంగా చూస్తే, ఎలిగెన్స్ వేరియంట్ ప్రస్తుత టాప్-స్పెక్ స్టైల్ కంటే మెరుగ్గా ఉండనుంది. అదే విధంగా ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ లో అందించబడుతుంది.
ఈ కొత్త స్లావియా ఎలిగెన్స్ వేరియంట్ గ్లోసీ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ పెయింట్ తో వస్తుంది. దాంతో పాటు అదనంగా, ఇది క్రోమ్ సరౌండ్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, పిల్లర్‌పై ఎలిగెన్స్బ్యాడ్జ్ మరియు క్రోమ్-ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్ మరియు విండో గార్నిష్‌తో పూర్తి బ్లాక్డ్-అవుట్ ఫ్రంట్ గ్రిల్ తో రానుంది. దీనికి అదనంగా, ఇది పడిల్ ల్యాంప్స్, 'స్లావియా' ఇన్ స్క్రిప్షన్ తో స్కఫ్ ప్లేట్స్, 'ఎలిగాన్స్' కుషన్స్ మరియు నెక్ రెస్ట్స్ మరియు అల్యూమినియం పెడల్స్‌ను కూడా కలిగి ఉండడం విశేషంగా చెప్పవచ్చు.
హుడ్ కింద, స్లావియా ఎలిగెన్స్ లో ఉన్న పవర్డ్ 1.5-లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‍జి గేర్‌బాక్స్ నిర్వహించనున్నాయి.
స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | ఎక్స్-షోరూం ధర |
స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ ఎంటి | రూ. 17,52,000 |
స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ ఎటి | రూ. 18,92,000 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్