- ఇండియాలో రూ.17.52 లక్షలు (ఎక్స్-షోరూం) తో ప్రారంభంకానున్న ధరలు
- పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్న ఎలిగెన్స్ ఎడిషన్
స్కోడా ఇండియా తాజాగా దేశంలో స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్ ను రూ.17.52 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. పరిమిత సంఖ్యలో అందించబడుతున్న ఈ మోడల్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ తో కేవలం సింగిల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు, ఈ స్పెషల్ ఎడిషన్ సెడాన్ ఇండియా అంతటా ఉన్న డీలర్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ప్రస్తుతం టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్ అయిన ఎలిగెన్స్ ఎడిషన్ కాస్మోటిక్ అప్‍డేట్స్ మరియు అదనపు ఫీచర్స్ ను పొందింది. ఇందులో ఆల్-న్యూ డీప్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ షేడ్, బి-పిల్లర్ పై “ఎలిగెన్స్” బ్యాడ్జింగ్, ఫ్రంట్ గ్రిల్ పై క్రోమ్ యాక్సెంట్స్, డోర్ మోల్డింగ్స్, మరియు టెయిల్ గేట్ ఉన్నాయి. అదే విధంగా, స్టీరింగ్ వీల్ పై “ఎలిగెన్స్” బ్యాడ్జింగ్ మరియు నెక్ రెస్ట్స్ పై “ఎలిగెన్స్” ఆర్ట్, సీట్ బెల్ట్స్, మరియు వెనుక భాగాన ఒక సెట్ పిల్లోస్ తో ఇంటీరియర్ లో మార్పులు చేయబడ్డాయి.
స్కోడా స్లావియా ఎలిగెన్స్ ఎడిషన్లోని 1.5-లీటర్ టిఎస్ఐ గ్యాసోలిన్ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పవర్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‍జి గేర్ బాక్స్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కి అందించబడుతుంది.